వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ప్రమోషన్‌లతో బిజీగా ఉన్న స్టార్ హీరో ప్రభాస్ గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నరని తెలుస్తోంది. అయినప్పటికీ భాధను ఓర్చుకుంటూ, నడవలేని స్థితిలో కూడా ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తున్న డార్లింగ్.. తాజాగా ఓ బిగ్ డిసిషన్ తీసుకున్నారట. ఫారెన్‌లో సర్జరీ చేయించుకొని ఓ సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట.
తన కటౌట్‌తో, అగ్రసేవ్ యాక్టింగ్‌తో, యాక్షన్ హీరోగా కెరీర్ బిగినింగ్ లొనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. తన సినిమాల్లోని స్టెంట్స్‌ను తనే చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సినిమా కోసం, తన ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా చేసేస్తుంటారు. ఇక ఆ క్రమంలోనే బాహుబలి సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ చేస్తూ మోకాలి గాయానికి గురయ్యారు. హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. ACL టియర్ (ఆంటీరియర్ క్యూరియేట్ లిగమెండ్ ఇంజురీ) గా డయజ్ఞోస్ అయ్యారు. అందుకోసం ఫారెన్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆపరేషన్ కూడా చేయించుకున్నారు.అయితే.. ఇప్పుడు ఈ గాయం తిరగబడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే వీలైయినంత తొందరలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కల్కి సినిమాలను ఫినిష్ చేసేసి.. మోకాలి సర్జరీకి అమెరికా వెళ్లనున్నారట. ఆ సర్జరీ అయిపోయాక ఒక సంవత్సరం పాటు సినిమాలకు గాప్ ఇవ్వనున్నారట. గాయం నుంచి పూర్తిగా కొలుకున్నాకే తిరిగి కొత్త సినిమాలు ఒప్పుకొనున్నారట. అయితే ఇప్పుడు ఇదే న్యూస్ డార్లింగ్ కాంపౌండ్ నుంచి లీక్ అయ్యి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫాన్స్‌ను కాస్త షాకయ్యేలా, ఆందోళన చెందేలా చేస్తుంది.