తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్నటి వరకు 69, 965 దరఖాస్తులు రాగా…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,399 కోట్లు ఆదాయం సమకూరింది.2021లో వచ్చిన రూ. 1,357 కోట్ల కంటే అధికం కావడం గమనార్హం. నేడు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అబ్కారి శాఖ అంచనా వేస్తోంది. కాగా, నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ల పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం పదిన్నరకు కరీంనగర్ మానేరు వంతెన పై సర్వాయి పాపన్న జయంతి వేడుకలలో పాల్గొంటారు. అనంతరం బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ హాల్లో 11 గంటలకు చేనేత వారోత్సవాల సమావేశం ఉంటుంది.