Devotional

ఈ రాశివారు నూతన కార్యాలకు శ్రీకారం

ఈ రాశివారు నూతన కార్యాలకు శ్రీకారం

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 19.08.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (19-08-2023)

చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (19-08-2023)

ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (19-08-2023)

కీలక వ్యవహారాలలో పెద్దలను కలుపుతారు. ఒక నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. దుర్గా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (19-08-2023)

మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి, సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (19-08-2023)

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు తొలగడానికి శ్రీరామరక్ష స్తోత్రం చదివితే మంచిది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (19-08-2023)

ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దైవారాధన మానవద్దు.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (19-08-2023)

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గ దేవి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (19-08-2023)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (19-08-2023)

అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (19-08-2023)

పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి, ఒక పరీక్షలాగా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువులలో అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (19-08-2023)

ప్రారంభించబోయే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (19-08-2023)

అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈