WorldWonders

మనిషికి కూడా గొప్ప సందేశం ఇచ్చే పక్షి గురించి మాట్లాడుకుందాం!

మనిషికి కూడా గొప్ప సందేశం ఇచ్చే పక్షి గురించి మాట్లాడుకుందాం!

ఇప్పుడు జీవనశైలిలో వచ్చిన మార్పులు ఆహారపు అలవాట్లనే కాదు ఆహారం తినే సమయాలను కూడా మార్చేసింది.తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. మారిన జీవనశైలి..మారుతున్న ఆహారపు అలవాట్లు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. పూర్వ మన పెద్దలు భోజనం చేసే సమయాన్ని చాలా కచ్చితంగా పాటించేవారు. సూర్యోదయం సాయంత్ర భోజనం చేయటం పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు మారిన జీవనశైలిలో రాత్రి 10.00గంటలు దాటితేనే గానీ భోజనం చేయటంలేదు.

కానీ మనుషుల్లో మార్పులొచ్చాయి గానీ పక్షుల్లో మాత్రం మార్పు రాలేదు.కానీ మనిషి తాను మారిపోతు ప్రకృతిలో జీవరాశుల జీవనశైలిపై కూడా ప్రభావం చూపిస్తున్నాడు. కానీ మనిషికి కూడా గొప్ప సందేశం ఇచ్చే ఓ పక్షి గురించి చెప్పుకుని తీరాలి. ఎంతో విచక్షణ కలవాడని చెప్పుకునే మనిషి మారినా తన జీవనశైలిని..ప్రకతి ధర్మాన్ని మార్చుకోని ఓ పక్షి గురించి చెప్పుకోవాలి. అదే ‘కాకి’. కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది. కాకి అని తేలిగ్గా తీసిపారేయొద్దు. చాలా గొప్ప లక్షణాలు కలిగినది కాకి. అందుకే ‘కాకిని కాలజ్ఞాని’ అంటారు.వేకువ జామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఎట్టిపరిస్థితుల్లోను ఆహారం ముట్టని జీవి కాకి మాత్రమే. అంతేకాదు సూర్యగ్రహణానికి ముందు..గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేసే ఏకైక పక్షి కాకి. గ్రహణం తరువాత తన గూడును శుభ్రం చేసుకునే పక్షి కాకి. “కావు కావు” అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు… ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ “కావు కావు” అని అందరికీ గుర్తు చేస్తుంది. అందుకే ‘కాకిని కాలజ్ఞాని’ అంటారు.

ఎక్కడయినా ఆహారం కనిపిస్తే తోటి కాకులకు పిలిచి కలిసి మెలిసి తింటాయి. తినే నాలుగు మెతుకులు అయినా పంచుకుని తినాలని కాకుల్ని చూసి మనిషి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆడ కాకి – మగ కాకి కలవడం కూడా ‘పరుల కంట’ పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. ఈరోజుల్లో మనుషులు పబ్లిక్ ప్లేసుల్లో కూడా అశ్లీలంగా ప్రవర్తిస్తుండటం చూస్తున్నాం. అటువంటిది ఓ పక్షి తన సంతానోత్పత్తి కోసం ప్రకృతి ధర్మం కోసం కలిసే కలయికనే అంత గోప్యంగా చేస్తుంటే మనుషులు ఇంకెత విచక్షణగా ఉండాలో కాకిని చూసి నేర్చుకోవాలి.

ఒక కాకి ప్రమాదశాత్తు మరణిస్తే తోటి కాకులు చుట్టు చేసి అరుస్తాయి. అది వాటి సంఘటితకు గుర్తు. చనిపోయిన కాకికి తమ అరుపులతో సంతాపం ప్రకటించి స్నానం చేస్తాయి.సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే అనటంలో ఎటువంటి డౌట్ లేదు. అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే. పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా కీలకమైనది. పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. కాకులు తమ గూటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటాయట.ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా వివరించారు. కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకున్న పక్షి కాకి…!సంఘజీవనం, సేవాతత్పరత, మంచి స్నేహభావాలతో, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా.. కలసి మెలసి నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవించాలనే కాకి జీవనశైలి ఇచ్చే గొప్ప సందేశం.

మరి కాకి గురించి కాకి జీవనశైలి గురించి ఇంత తెలుసుకన్నాక కాకిని తేలిగ్గా తీసిపారేయగలమా..?కాకి జీవనంలో ఇంత తాత్వికత ఉందా..? ఇంత గూఢార్థ ఉందా అని అనిపించకమానదు. అటువంటి గొప్ప సుగుణాలు కలిగిన కాకి జాతి అంతరించిపోతోంది.అంతరించిపోతున్న కాకుల్ని కాపాడుకుందాం. ఒకప్పుడు ఎక్కడి పడితే అక్కడ కాకి అరుపులు కావు కావు మంటూ వినిపించేవి. అటువంటిది ఇప్పుడు పెద్దలకు శ్రార్ధకర్మలు చేసి పిండప్రధానం చేస్తే వాటిని ముక్కుతో ముట్టటానికి కూడా కాకులు కనపించటంలేదు.కాకి రూపంలో మరణించిన పెద్దలు తిరుగుతుంటారని ఒక నమ్మకం ఉంది. సాక్షాత్తూ యమ ధర్మరాజే వాటికి ఆ వరం ఇచ్చినట్లుగా కూడ ఒక కధనం ఉంది. వాటి దృష్టి తమ సంతానం, వంశ వారసులపైనా కూడా ఉంటుందట. అందుకే మరణించినవారికి జరిపే శ్రాద్ధకర్మలలో కాకికి పిండం పెట్టడం దానిని కాకి తింటే ఆ మరణించిన పెద్దలు భక్తితో శ్రద్ధతో చేసిన కర్మకాండలకు సంతృప్తి చెందుతారని భావిస్తారు.