NRI-NRT

కాలిఫోర్నియా: అక్టోబర్‌లో 13వ తెలుగు సాహిత్య సదస్సు

కాలిఫోర్నియా: అక్టోబర్‌లో 13వ తెలుగు సాహిత్య సదస్సు

అమెరికాలోని మిల్పిటస్ నగరం, కాలిఫోర్నియాలో అక్టోబర్ 21, 22 తేదీల్లో జరగనున్న 13వ తెలుగు సాహితీ సదస్సుకు సంబంధించి తమ ప్రకటనలకు, వ్యక్తిగత ఆహ్వానాలకు అమెరికా వచ్చిన అనూహ్య స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని నిర్వాహకులు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్త నిర్వహణలో నెలకొల్పిన కార్యనిర్వాహక వర్గం సదస్సు ఉన్నత స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.. త్వరలోనే పూర్తి విశేషాలు, సమాచారం అందజేస్తుంది. ఇప్పటివరకు ప్రసంగ ప్రతిపాదనలు, సభ విశేష సంచికలో ప్రచురణ కోసం ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాసాలు, ప్రతిపాదనలు పంపిన అందరికీ కృతజ్ఞతలు. సంక్షిప్త వ్యాసాలు మాత్రమే పంపినవారికి, సదస్సులో వ్యక్తిగతంగా పాల్గొని ప్రసంగించాలనుకున్న వక్తలకు, ప్రచురణార్థం పరిశోధన వ్యాసాలు పంపించాలనుకున్న వారంతా తమ వ్యాసాలను ఆగస్టు 25 నుంచి 30 వరకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత అందిన ప్రసంగ ప్రతిపాదనలు, వ్యాసాలు పరిశీలనలోకి తీసుకోలేమని చెప్పారు. అందువల్ల ఇదే తమ చివరి విన్నపంగా పరిగణించాలని నిర్ణయించుకోండి. సంక్షిప్త వ్యాసాలు మాత్రమే పంపిన వారికి తమ పూర్తి వ్యాసాలు వెనువెంటనే వారికి అందించాలని మరోసారి కోరుకుంటున్నాను. సదస్సు వివరాల కోసం అందించామని మరొకసారి కోరుతున్నాం. ప్రసంగ ప్రతిపాదనలు, పూర్తి వ్యాసాలను తాటిపాముల మృత్యుంజయుడు: E-mail: thatipam@gmail.com, WhatsApp: 1 (408) 386-2909; శాయి రాచకొండ: ఇ-మెయిల్: sairacha@gmail.com, WhatsApp: (281) 235-6641; వంగూరి చిట్టెన్ రాజు: E-mail: vangurifoundation@gmail.com: WhatsApp: 832 594 9054 పంపించాలని నిర్వాహకులు.