ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ) తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సాహాసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటూ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకుగాను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా(Australia) శాఖ సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభను ఘనంగా నిర్వహించింది. మెల్బోర్న్లో (BRS Melbourne )నిర్వహించిన సభకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా శాఖ ఇన్చార్జి అనిల్ బైరెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు.
దేశంలో రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబంధు (Raitu Bandu), రైతు రుణమాఫీ, రైతు బీమా (Raitu Beema) లాంటి పథకాల్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆర్టీసీ (RTC) ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు కృతజ్ఞతగా సభను ఏర్పాటు చేశామని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ రైతు సంక్షేమానికి నిరంతరం పాటు పడుతుందని వివరించారు. రాష్ట్రం ఏర్పడక ముందు, తరువాత తెలంగాణ అన్ని రంగాల్లో పరుగులు పెడుతుందని అన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని కోరారు. పంజాబ్(Punjab), గుజరాత్ (Gujarat) రాష్ట్రాలకు చెందిన నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు రమేష్ ముత్యాల మధు, పార్శ రవీందర్, చుక్క సత్యనారాయణ, గుండా మధు, పైల కార్తీక్, విద్యాసాగర్, రాయల సాయిరాం, సందీప్, అనిల్, వంశీ సురభి, కుల్విందర్ హర్మేందర్ సింగ్, దిలీప్ రెడ్డి, అవినాష్ , సంతోష్ రెడ్డి, తెలంగాణ సంఘ నాయకులు పుల్లారెడ్డి , రాజు వర్ధన్ రెడ్డి, దీపక్, కిరణ్, ప్రవీణ్ పలువురు పాల్గొన్నారు