నేడు ప్రపంచ ఫొటోగ్రాఫీ డే. నేటి వేగవంతమైన ప్రపంచంలో క్షణాలు రెప్పపాటులో గడిచిపోతున్నాయి. ఫోటోగ్రఫీ కళా రూపంగా నిలుస్తుంది. మనం మళ్లీ గడిచిపోయిన క్షణాలను గుర్తు చేసుకుని ఆనందించడానికి ఫొటో సాక్షంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఫొటోకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ఫొటోను మన జీవితాంతం గుర్తుండి పోయే జ్ఞాపకంగా దాచుకుంటారు.
ఇప్పుడున్న టెక్నాలజీతో చాలా మంది ఏం చేసిన తమ కల్లెదుట చిన్న సంఘటన ఏం జరిగినా ఫొటో క్లిక్ మనిపిస్తుంటారు. నిత్యం స్మార్ట్ ఫోన్‌లో ఫొటోలను తీసుకుని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ దాని ప్రత్యేకతను అందరికీ తెలిసేలా చేస్తున్నారు. ఎంత దూరంలో ఉన్నా సరే ఫొటో ద్వారా తమ గురించి ఎదుటి వారికి అర్థమయ్యేలా చేసేస్తున్నారు. అలాగే ఎలాంటి కేసులో అయినా కొన్నిసార్లు ఫొటోలే కీలకం అవుతున్నాయి.
అయితే ఫొటోగ్రఫీ డేను మొదట జనవరి 9న 1839 డాగ్యురోటైప్‌ను ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారికంగా ఆమోదించింది. ఏడు నెలల తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వం ఆగస్టు 19, 1839న పరికరం కోసం పేటెంట్‌ను కొనుగోలు చేసింది. డాగ్యురోటైప్ ఆవిష్కరణను ప్రపంచానికి బహుమతి అని పిలుస్తారు. ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచబడింది. ఈ రోజు మనం ఫోటోగ్రాఫ్‌లను ఎలా తీయాలో, మన జీవిత క్షణాలను ఎలా పంచుకోవాలో విప్లవాత్మకమైన సాంకేతిక పురోగతికి నివాళిగా మాత్రమే కాకుండా, లెన్స్ వెనుక ఉన్న కళాత్మకత, సృజనాత్మకతకు ఇది ఒక వేడుక కూడా.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఆగష్టు 19, 2010 నాటిది, ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ల కోర్స్ అరా, టీమ్ హార్వే దీనిని ప్రారంభించారు. ఈ రోజు దాని మొదటి గ్లోబల్ ఆన్‌లైన్ గ్యాలరీని నిర్వహించింది. ఇందులో 270 కంటే ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్‌లు తమ ఫోటోలను పంచుకున్నారు. లెన్స్ ద్వారా వారి ప్రపంచాన్ని పంచుకునేలా ప్రజలను ప్రోత్సహించడం, సమాజంపై ఫోటోగ్రఫీ ప్రభావాన్ని అభినందించడం దీని లక్ష్యం.