Business

వాట్సాప్‌లో AI స్టిక్కర్లను ఈ విధంగా వాడండి

వాట్సాప్‌లో AI స్టిక్కర్లను ఈ విధంగా వాడండి

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో సందడి చేస్తున్న వాట్సాప్‌ (Whatsapp) ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో స్టిక్కర్లను రూపొందించే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇంతకీ ఏఐ స్టిక్కర్లను ఎలా రూపొందించాలో తాజాగా వాబీటా ఇన్ఫో వెల్లడించింది. వాట్సాప్‌కు సంబంధించి తాజా అప్‌డేట్స్‌ను వాబీటా ఇన్ఫో అందిస్తుంది.

AI స్టిక్కర్‌ రూపొందించడం ఎలా?

  • వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి..‘ఓపెన్‌ ఎనీ చాట్‌’పై క్లిక్‌ చేయాలి.
  • చాట్‌ పేజీలో దిగువన ఉన్న స్మైలీ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే స్టిక్కర్‌ విండో ఓపెన్‌ అవుతుంది.
  • AI స్టిక్కర్‌ ఫీచర్‌ మీకు అందుబాటులో ఉంటే..‘ Genarate your Own Sticker’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత ‘Create’ ఆప్షన్‌ ఎంచుకొని.. ఎలాంటి స్టిక్కర్‌ కావాలో, దానికి సంబంధించిన వివరాలను ఎంటర్‌ చేయాలి.

ఆ సమాచారం ఆధారంగా.. వివిధ AI స్టిక్కర్లు అక్కడ కనిపిస్తాయి. వాటిని మీరు సెలక్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు.అయితే, ఈ ఫీచర్‌ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై మెటా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా స్టిక్కర్స్‌ రూపొందించేందుకు ఏ AI మోడల్‌ వినియోగిస్తోందన్నది కూడా బయటకు వెల్లడించలేదు. అయితే, ఈ ఫీచర్‌కు అవసరమైన భద్రత, కాపీరైట్స్‌ ఉండేలా తీసుకొచ్చే అవకాశం ఉంది. సందర్భానికి తగినట్లుగా రూపొందించే ఈ స్టిక్కర్లు అవతలి వ్యక్తికి కూడా సులువుగా అర్థమయ్యేందుకు వీలుంటుంది.