Politics

నేడు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ ప్రెస్ మీట్

నేడు మధ్యాహ్నం  ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ ప్రెస్ మీట్

సోమవారం మధ్యాహ్నం అధికార బీఆర్ఎస్ కు చెందిన తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాటినుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి కూడా అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికలో అనేక కసరత్తులో చేసింది. సోమవారం తొలి జాబితా ప్రకటించనున్నట్లు ప్రకటించినా.. ఇప్పుడు మధ్యాహ్నం 2.30 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ రోజుతో కారు ఎక్కబోయేది ఎవరు అనేది తేలనుండడంతో ఈ జాబితాకు సంబంధించి అభ్యర్థుల్లో.. తీవ్ర ఉత్కంఠ ఉంది. మరోపక్క సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వొద్దంటూ ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంటికి ఆశావహులు క్యూ కట్టారు. మధ్యాహ్నం కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రారంభించిన తరువాత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలిపిన తరువాత జాబితాను ప్రకటించనున్నారు. 2.30 గంటలకు కేసీఆర్ ఈ జాబితాను విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటివరకు 10మంది సిట్టింగులకు సీట్లు నిరాకరించారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కవిత, హరీష్ రావు వివరణ ఇచ్చారు. తొలి జాబితాలో 95నుంచి 105మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు.

మిగతావారి జాబితాను వచ్చే శుక్రవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్ కు ఎమ్మెల్యే కవిత, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూధనాచారీలు చేరుకున్నారు.