బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్.. హ్యాట్రికి లక్ష్యంగా ఎన్నికలకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే, కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కేవలం 7 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే మార్పులు చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. నాలుగు స్థానాలను కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు.అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టికెట్ రాణి వాళ్ళ పార్టీలోనే ఉండండి.. మంచి రోజులు వస్తాయి అని అన్నారు. పరిస్థితిని బట్టి అభ్యర్థుల మార్పు చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్16 న వరంగల్ లో భారీ ర్యాలీ.. అక్కడే మేనిఫెస్టో, పార్టీ క్రమశిక్షణ తప్పితే.. తీసి అవతల పారేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేనికి కాకుండా పోతారు.. మాది సన్యాసుల మఠం కాదు.. మాది రాజకీయ పార్టీ.. ఓట్లు కావాలని ఆనుకుంటాం కదా.. మేనిఫెస్టోలో మాక్కూడా వ్యూహం ఉంటది కదా.. ప్రగతి అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నామని కేసీఆర్ అన్నారు. గోశామహల్, నాంపల్లి, నర్సాపూర్, జనగామ.. ఈ నాలుగు స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.