Movies

“రక్షకుడు” సినిమా కథ రతన్ టాటా నిజజీవితానుభవం

“రక్షకుడు” సినిమా కథ రతన్ టాటా నిజజీవితానుభవం

‘‘టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన 15 రోజులకు నేను ఈ సమస్యను ఎదుర్కొన్నాను. మా సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్‌లో పెద్ద మొత్తంలో సంపద ఉందని భావించిన ఓ గ్యాంగ్‌స్టర్‌, ఎలాగైనా దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. మా సంస్థలో అతడికి 200 మంది అనుచరులు ఉన్నారు. వారితో కంపెనీ కార్యకలాపాలు అడ్డుకోవాలనుకున్నాడు. కానీ, నేను మాత్రం అతడి ఒత్తిడికి తలొగ్గకుండా.. అతడిని ఎదుర్కొవాలని నిర్ణయించుకున్నాను. నాతో ఉన్నవారు, సంస్థలోని ఉద్యోగులు మాత్రం గ్యాంగ్‌స్టర్‌కు పోలీసుల మద్దతు కూడా ఉండటంతో అతడితో రాజీ పడటం మంచిదని భావించారు. మేం ఊహించినట్లుగానే అతడు మా ప్లాంట్‌ కార్యకలాపాలను అడ్డుకున్నాడు. తన అనుచరులతో సమ్మెకు పిలుపునిచ్చాడు. సమ్మె పిలుపుతో కొద్ది మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యేవారు. వారికి అండగా ఉంటానని భరోసానిచ్చేందుకు నేను కూడా రోజంతా ప్లాంట్‌లోనే ఉండేవాడిని. దీంతో మిగిలిన ఉద్యోగులు సైతం ప్లాంట్‌కు వచ్చి పనిచేయడం మొదలుపెట్టారు. గ్యాంగ్‌స్టర్‌ మాత్రం ప్లాంట్‌ మూతపడిందని ప్రచారం చేసినా , దాన్ని తిప్పికొట్టేందుకు ప్లాంట్ పనిచేస్తుందని, ఉద్యోగులు తిరిగి విధులకు హాజరయ్యారని మేము ప్రకటనలు ఇచ్చాము. యాజమాన్యం వెనక్కి తగ్గడం లేదని గ్రహించి, మిగిలిన ఉద్యోగులు కూడా సమ్మెను విరమించడంతో గ్యాంగ్‌స్టర్‌ పథకం బెడిసికొట్టింది. తర్వాత, గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు జైలు నుంచి విడుదలయ్యాక నన్ను హత్య చేయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అతడితో రాజీ పడాలని సూచించారు. కానీ, నేను తగ్గలేదు.’’ అని రతన్‌ టాటా తెలిపారు.