బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధర్వర్యంలో వనభోజనాలు, భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు లాం కృష్ణ మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న GWTCS 50వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ తయారు చేసిన రాగి సంకటి భోజనాల్లో అలరించింది. కోడి కూర, పూరి, పలావ్, కుర్మా తదితర వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రవాసులకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో అతిథులు ఉత్సాహంగా పాల్గొన్నారు.