Business

ఏపీలో స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలో స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌. AP వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో 14 స్పెషాలిటీల్లో…300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టుల కోసం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీసులో… వచ్చేనెల 5, 7, 10 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, గైనకాలజీ సహా ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, జగనన్న విద్యా దీవెన పథకం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 28వ తేదీన చిత్తూరు జిల్లా నగరిలో ఈ పథకం మూడవ క్వార్టర్ అమౌంట్ ను బటన్ నొక్కి నేరుగా విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. పర్యటన అనంతరం జరిగే సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.