Politics

తుమ్మలకు కేసీఆర్ మొండిచేయి. వేడెక్కిన ఖమ్మం రాజకీయం.

తుమ్మలకు కేసీఆర్ మొండిచేయి. వేడెక్కిన ఖమ్మం రాజకీయం.

ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్‌ తమకే వస్తుందని భావించిన వారికి భంగపాటు తప్పలేదు. పాలేరు నుంచి తనకే టికెట్‌ వస్తుందని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌ను పొగుడుతూ ప్రకటనలు చేశారు. ఇంతలోనే సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాల పేరు ప్రకటించడంతో తుమ్మల వర్గం కంగుతిన్నట్లయింది. ఇక కొత్తగూడెం స్థానం విషయంలో వనమాపై కోర్టు కేసు నేపథ్యంలో జలగం వెంకట్రావుకు టికెట్‌ ఇస్తారంటూ ప్రచారం గుప్పుమంది. అయినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన వనమాకే టికెట్‌ కట్టబెడుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తుమ్మల అనుచరులు ఖమ్మంలోని వీసీరెడ్డి ఫంక్షన్‌ హాలులో మంగళవారం భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కాంగ్రెస్‌ చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి.