నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. విజయవాడలోని మూడు నియజకవర్గాల్లో యువగళం యాత్ర పూర్తైంది. గన్నవరంలో లోకేష్ యాత్ర సాగుతోంది. బుధవారం మద్యాహ్నం గన్నవరం సమీపంలోని చిన అవుటపల్లి నుంచి పాదయాత్ర షెడ్యూల్ ఉంది. చిన అవుటపల్లి, వీరవల్లి, రంగన్నగూడెం, సింగన్నగూడెం మీదుగా మల్లవల్లి చేరుకుంటారు. ఇదే రూట్‌లో రంగన్న గూడెం దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వెలిసింది. యువగళమైనా, జనగళమైనా, ఏ గళమైనా తెలుగునాట స్మరించేది నందమూరి తారకరామారావు పేరు మాత్రమే అంటూ ఆ ఫ్లెక్సీ మీద రాసి ఉంది. ఎన్టీఆర్, హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా బ్యానర్ కడితే.. వాళ్ల పేర్లు గానీ, ఫోటోలు గానీ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ అవేమీ లేవు. దీంతో ఇవి ఎవరు కట్టారనే దానిపై క్లారకిటీ లేదు. అయితే ఆ గ్రామంలో టీడీపీ మద్ధతుదారులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో వాళ్లలో ఎవరో ఒకరు కట్టి ఉంటారని చెప్తున్నారు స్థానికులు.
గన్నవరంలో సూపర్ ఫ్లెక్సీ కట్టిన NTR అభిమానులు
Related tags :