WorldWonders

మంచిర్యాల వ్యక్తికి స్త్రీ పురుష జననావయవాలు

మంచిర్యాల వ్యక్తికి స్త్రీ పురుష జననావయవాలు

‘మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి వివాహమై ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. ఇటీవల పొత్తి కడుపు కింద తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన స్థానిక ఆసుపత్రిని సంప్రదించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు. మేము అతనికి అల్ట్రాసౌండ్‌ సహా వివిధ పరీక్షలు నిర్వహించాం. అతనిలో పురుషాంగం సాధారణంగానే ఉన్నప్పటికీ వృషణాలు పుట్టినప్పటి నుంచి ఉదరభాగంలోనే ఉండిపోయినట్టు, స్త్రీలలో మాదిరిగానే గర్భసంచి, ఫాలోపియన్‌ ట్యూబ్‌లు, స్త్రీ జననాంగంలోని కొంతభాగం అదే ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించాం. ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో లోపల ఉన్న వృషణాలు, ఫాలోపియన్‌ ట్యూబులు, గర్భసంచి, స్త్రీ జననాంగం తొలగించాం’ అని డాక్టర్‌ ప్రశాంత్‌ వెల్లడించారు.