ఇటీవలి కాలంలో టమాటా ధరలు ఎవరూ ఊహించని రీతిలో పెరగడం అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో టమటా ధర అనూహ్యంగా పెరిగి కిలో రూ.250 దాటింది. సామాన్యులు కొనలేని ఇలాంటి కూరగాయలు ప్రపంచంలో చాలానే ఉన్నాయట. అందులో ముఖ్యంలో ఓ ఐదు కూరగాయలు మాత్రం ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ వెజిటేబుల్స్ అంట.. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లా బోనోట్ బంగాళాదుంపలు:బంగాళాదుంపల్లో సాధారణంగా విటమిన్ సి ఉంటుంది. లా బోనొట్టే పొటాటోస్ అని పిలువబడే ఒక ప్రత్యేక రకం ధర మాత్రం ఊహించని విధంగా లోకు రూ. 50వేల నుండి 90 వేల వరకు ఉంటుందంటే మాటలు కావు. ఈ బంగాళాదుంప రూపాంతరం అనూహ్యంగా అరుదైనది. ఫ్రాన్స్‌లోని ఏకాంత తీరంలో మాత్రమే ఇది పెరుగుతుంది. అంతే కాదు ప్రతి సంవత్సరం కేవలం 10 రోజులపాటు మాత్రమే మార్కెట్లో లభ్యం కావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మత్సుకే పుట్టగొడుగు: జపాన్‌లో ఉద్భవించిన మాట్సుటాకే పుట్టగొడుగు శరదృతువు నెలల్లో పెరుగుతుంది. దురదృష్టవశాత్తు, ఈ ప్రత్యేకమైన పుట్టగొడుగు రకం నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతోంది. ఈ పుట్టగొడుగుల వార్షిక దిగుబడి ఇప్పుడు 1వెయ్యి టన్నుల కంటే తక్కువకు పడిపోయింది. ప్రస్తుతం, ఒక పౌండ్ ధర రూ. 75వేల నుండి రూ. 1.5 లక్షల మధ్య ఉంది.
హాప్ షూట్స్:ఉత్తర అమెరికాకు చెందిన ఈ హాప్ షూట్స్.. స్పష్టమైన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. కోన్-ఆకారపు పువ్వుల ద్వారా ఇవి వర్గీకరించబడతాయి. వీటిని బీర్ వంటి పానీయాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాదు ఔషధ గుణాలు గల హాప్ రెమ్మలు ఎంతో ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటాయి. ఇక హాప్ షూట్స్ ధర విషయానికొస్తే కిలోగ్రాము ధర రూ.85వేలుగా ఉంటుందట.
వాసబి రూట్:వాసబీ రూట్, సాగు చేయడానికి అత్యంత డిమాండ్ ఉన్న కూరగాయలలో ఒకటి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త వ్యవసాయంలో దీని కొరతగా చాలానే ఉంది. వ్యాధులకు గురయ్యే ఈ సున్నితమైన మొక్క, వృద్ధి చెందడానికి ఖచ్చితమైన తేమ స్థాయిలు, నిర్దిష్ట పోషకాలు అవసరం. దీని విలువ కిలో రూ.7వేల – 8వేల మధ్య ఉంటుందని అంచనా.
యమషితా బచ్చలికూర:ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉండే యమషితా బచ్చలికూర-మానవ శ్రేయస్సుకు ఎన్నో ప్రయోజనకరమైన మూలకంగా ఉపయోగపడుతుంది. ఇది కిలోగ్రాముకు రూ. 3వేల ధరను కలిగి ఉంది. దీని ఖరీదు కారణంగా చాలా మంది తమ రోజూవారి ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడమే కాస్త కష్టమే.