యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”స్కంద”.బోయపాటి అంటేనే ఫుల్ ఊర మాస్.మరి అలాంటి బోయపాటితో రామ్ సినిమా అంటే థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం అనేలా ఈ సినిమా తెరకెక్కుతోందని ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో అర్ధం అయ్యింది.
ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ ను రిలీజ్ అవ్వగా.రెండు కూడా ఫాస్ట్ బీట్స్ తో అలరించాయి.ఇక ఇప్పుడు రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.ఈ క్రమంలోనే ఈ రోజు మరో పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ రోజు స్కంద నుండి వచ్చిన పోస్టర్ ను చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.ఈ మధ్య కాలంలో ఇంత కలర్ఫుల్ పోస్టర్ ను చూడలేదని చెబుతున్నారు.ప్రీ రిలీజ్ థండర్ అంటూ ఆగస్టు 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించ బోతున్నట్టు పోస్టర్ ద్వారా మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.ఈ పోస్టర్ తో ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అని తెలిపేలా చేసాడు.మరి అఖండ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి రామ్ కు కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.