DailyDose

విమానంలో మందుబాబుల హల్‌చల్

విమానంలో మందుబాబుల హల్‌చల్

దుబాయ్‌ నుంచి కొచ్చికి బయలుదేరిన ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించారు. ఇదేమని అడిగిన సిబ్బందిపై, ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు. దీంతో విమానాన్ని పైలట్‌ దారిమళ్లించి శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. ఆ నలుగుర్నీ భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని… పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ ఠాణా పోలీసులు తెలిపారు.