దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మారకంగా కేంద్రం 100 రూపాయల నాణాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనిని విడుదల చేస్తారు. కార్యక్రమానికి హాజరుకావాలని నారా చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణాన్ని ముద్రించింది.