Agriculture

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఆగస్టు 25 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 2 మధ్య విరామం అనంతరం సెప్టెంబర్‌ 3 తర్వాత రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.