DailyDose

ప్రకాశంలో చంద్రబాబు ఓదార్పు యాత్ర-రాజకీయ-07/05

Chandrababu To Conduct Odarpu Yatra In Prakasam District-Daily Politics In Telugu-July52019

* ప్రకాశం జిల్లా పర్చూరు మండలం రుద్రమాంబపురం తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెదేపా కార్యకర్త పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెదేపా తరఫున రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించారు. పద్మ పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్‌ ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. ఈ మృతికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. దాడిలో పద్మ భర్తకు తీవ్ర గాయాలయ్యాయన్న చంద్రబాబు…ఇలాంటి ఘటనలను నాగరిక సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు కామెంట్స్ప్రకాశం జిల్లాచాలా దురదృష్టకరమైన రోజు.పద్మావతి ఆత్మకుశాంతి చేకూరాలని ఆశిస్తున్నా.నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న.ఇక్కడున్న పోలీసులు, ప్రభుత్వం అనాగరికానికి పాల్పడ్డారు.ఇంట్లోఉన్న మహిళను రోడ్డు మీదకు లాకొచ్చి వైసీపీ వర్గాలు తన్ని ఒక ఆడబిడ్డ పై ధుర్మార్గంగా వ్యవహరించారు.వివస్తను చేసి కారంచల్లారు.వారిదెబ్బలకు తాలలేకనే ఆమె చనిపోయింది.హోమంత్రి ఇలాంటి వి జరగడం మామూలే అంటోంది.వారిబిడ్డలకు కూడా ఇలాగే జరుగుతే ఊరుకుంటారా.ఇవాల అనాదలైన ఆమె పిల్లలకు ఏమి సమాదానం చెబుతారు.చంపినోడు రోడ్డు మీద భహిరంగంగా తిరుగుతున్నారంటే ఎవరిచ్చారు మీకు చంపే హక్కు.ఇందుకా మీకు అధికారం ఇచ్చింది.రౌడీ రాజ్యంతో మరో పులివెందుల చేయాలను కుంటున్నారా.ఈ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే సభ్యసమాజం మిమ్మల్ని క్షమించదు.పోలీసులు కూడా ఇష్టాను సారంగా మాట్లాడుతు న్నారు అధికారం శాస్వితం కాదు మేమూ రికార్డు చేస్తాం.మాహయాంలో లా అండ్ ఆర్డర్ కాపాడాము.ఇప్పుడు చేతులెత్తేశారు.రాష్ట్రంలో6 హత్యలు, రేపులు, 90ధాడులు టీడీపీ పై జరిగాయి.భయపెట్టి టీడీపీ వర్గాన్ని మీ వైపు లాక్కొవాలని చూస్తారా.పద్మావతి హత్యపై చర్చ జరగాలి.మీకు అధికారం ఇచ్చింది ప్రజలు ఏడ్చడానికా..మీకు ఓటు ఎందుకు వేశామా అని కార్యకర్తలు భాదపడుతున్నారు.రావణకాష్ట చేస్తే తిరగబడతాం..మనం తిరగబడితే అంతమందిని జైల్లో పెట్టలేరు..పోలీసుల వల్లకాదు.విద్వేషాలు ఏరోజు నేను రెచ్చగొట్టలేదు.ఈ రోజు పార్టీ క్యాడర్ పై జరుగుతున్న ధాడులు జరుగుతుంటే భాద వేసి టీడీపీ కుటుంబాన్ని కాపాడుకునేందుకు రక్షణగా నిలిచేందుకు వచ్చాం.పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాలే గాని అనగదొక్కకుడదు.భాదితుల పిల్లల పేరుమీద టీడీపీ5లక్షల తోపాటు పూర్తిగా చదివించేభాద్యత నాది.స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చిన మరో 2లక్షలను మోత్తాన్ని పిల్లు తండ్రి పేరున వేస్తాం.రాష్ట్ర పోలీసు భాసు దీనికి సమాదానం చెప్పాలి.దీనిపై రాజీలేని పోరాటాన్ని సాగించి మీకు అండగా నిలుస్తా.దీనిని ఈ ప్రభుత్వం భాద్యతగా తీసుకోవాలి.పద్మ ఆత్మ శాంతికలీగేలా రెండు నిమిషాల పాటు మౌనాన్ని పాటించిన బాబు టీడీపీ వర్గాలు.కుటుంబ సబ్యులకు సమాదానం చెప్పని వారికి కాలమే నిర్ణయిస్తుంది.
* ఏపీలో 8న రైతు దినోత్సవం: కన్నబాబు
ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొంటారని.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు రైతు దినోత్సవం నిర్వహిస్తారని చెప్పారు. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రానికి సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న వేరుశనగ విత్తనాల కొరతను సరిదిద్దామని చెప్పారు. మొత్తం 3.13 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేసినట్టు తెలిపారు. ఉత్తరాంధ్రలో సరిపడా విత్తనాలను సరఫరా చేశామని మంత్రి వివరించారు.
* దేశంలోని పేద ప్రజలకు బడ్జెట్ అంకితం: జేపీ నడ్డా
దేశంలోని పేద ప్రజలందరికీ బడ్జెట్ అంకితమని భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌పై జేపీ నడ్డా స్పందిస్తూ.. దేశంలోని దళితులు, రైతులు, యువత, మహిళలకు బడ్జెట్ అంకితమన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను బడ్జెట్ ప్రతిబింభిస్తుందన్నారు. ఈ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
* దక్షిణాదిపై కేంద్రం వివక్ష: బడ్జెట్‌పై రేవంత్‌
బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో విద్య, ఉద్యోగాలకు ప్రోత్సాహం అందించే ఎలాంటి పథకాలూ లేవని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రూ.1 పన్ను చెల్లిస్తే తిరిగి రూ.2 చెల్లిస్తున్నారని.. బిహార్‌ రూ.1 పన్ను ఇస్తే తిరిగి రూ.1 ఇస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూ.1 పన్ను చెల్లిస్తే 65 పైసలే ఇస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆదాయపన్నులో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి దక్షిణాదికి చెందిన వారైనా ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మే అని రేవంత్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.
* బండి సంజయ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసేయండి
రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించేందుకు అసెంబ్లీలు ఉన్నాయని, అందువల్ల పలువురు ఎంపీలు సభలో లేవనెత్తిన రాష్ట్ర అంశాలను రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్‌ బిర్లాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ బీజేపీ ఎంపీలు గందరగోళం సృష్టిస్తున్నారని వారు స్పీకర్ కుఫిర్యాదు చేశారు. గురువారం టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలు పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో స్పీకర్‌ను కలిశారు. ఇంటర్ స్టూడెంట్ల ఆత్మహత్యల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ బండి సంజయ్‌, ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉద్దేశపూర్వకంగానే సభలో లేవనెత్తి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
* రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు: ఎంపీ ధర్మపురి అర్వింద్
‘‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 27 మంది ఇంటర్ స్టూడెంట్లు చనిపోయారు. వారంతా భారతీయులు. వారి ఆత్మహత్యల అంశం పార్లమెంటులో లేవనెత్తడం ఎంపీలుగా మా బాధ్యత. స్టూడెంట్ల చావులకు కారణమైన వారిని శిక్షించకుండా సీఎం చోద్యం చూస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. చనిపోయిన స్టూడెంట్ల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు మా పార్టీ పోరాడుతుంది”అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. స్టూడెంట్ల ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ఎంపీలు కుటిల కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. స్టూడెంట్ల ఆత్మహత్యల అంశం రాష్ట్రానికి సంబంధించినదని, పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ను కోరడం సిగ్గుచేటని అన్నారు. గురువారం పార్లమెంటు వద్ద అర్వింద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన నామా నాగేశ్వర్ రావుతో కలిసి టీఆర్ఎస్ ఎంపీల బృందం స్పీకర్ ని కలవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోదామంటే ఫామ్హౌస్లో ఉండి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని అర్వింద్ ఆరోపించారు.
* వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు : నారా లోకేష్
ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు నారా లోకేష్. ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చెయద్దన్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతుల సందర్భంగా చంద్రబాబుగారిపై యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన దానిని వక్రీకరిస్తూ..నాకు అబద్దాలు చెప్పడం అలవాటే అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు చెప్పారంటూ జగన్ పై ఫైరయ్యారు లోకేష్.చంద్రబాబుగారిమీద జోకులు వేయబోయి.. మీ తండ్రిగారైన వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని మరొక్కసారి ప్రజలకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు అన్నారు లోకేష్ . జగన్ అనాటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ఓసారి చదువుకొని వస్తే బాగుండేదన్నారు. వైఎస్ హయాంలో ధనయజ్ఞం జరుగుతున్న రోజుల్లో మీరు సెటిల్ మెంట్లతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇచ్చంపల్లి, ఎల్లంపల్లిలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం లేదంటూ జగన్ పై సెటైర్లు వేశారు లోకేష్.
* గ్రామ కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తాం – సీఎం జగన్
ఆర్ధిక శాఖపై రివ్యూ చేశారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. 2019-20 బడ్జెట్‌లో ఉండాల్సిన ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 11 వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 12 వ తేదీన సీఎం జగన్‌. నేతృత్వంలో ప్రభుత్వం.. తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మొత్తం 15 పనిదినాల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్‌లో నవరత్నాల అమలుకే పెద్ద పీటే వేయనున్నారు. ఇప్పటికే నవరత్నాల్లోని 60 శాతంపై గా అంశాలపై రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన నవరత్నాల్లోని అంశాలన్నింటికి బడ్జెట్‌లో తగిన కేటాయింపు చేస్తామన్నారు.
* బడ్జెట్‌ నిరుత్సాహ పరిచింది: ఉత్తమ్
బడ్జెట్‌ నిరుత్సాహ పరిచిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రైతులు, నిరుద్యోగుల గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదని చెప్పారు. పబ్లిక్‌ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సరికాదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందన్నారు.
* ఏ రాష్ట్రానికి, ప్రజలకు బడ్జెట్‌ ఉపయోగకరంగా లేదు: ప్రభాకరరెడ్డి
కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తున్నాయి. ఏ రాష్ట్రానికి, ప్రజలకు బడ్జెట్‌ ఉపయోగకరంగా లేదని ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి విమర్శించారు. ప్రతి ఇంటికి తాగునీరు బడ్జెట్‌లో పెట్టడం సంతోషకరమని, ఇప్పటికే తెలంగాణలో మిషన్ భగీరథ పేరుతో అమలు చేస్తున్నామని తెలిపారు. దాన్నే కేంద్రం పేరు మార్చి బడ్జెట్‌లో పెట్టుకున్నారన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని, మొత్తంగా బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపిందని కొత్త ప్రభాకరరెడ్డి విమర్శించారు.
* బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం: నిర్మలాసీతారామన్‌
బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ సమీకృత ఆర్థికాభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పదేళ్ల విజన్‌తో బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు. రైతులకు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చామని, మధ్యతరగతి ప్రజలకు చాలా మేలు జరిగిందని సీతారామన్‌ తెలిపారు. బ్యాంకులకు మూలధనం పెంచడంతో మేలు జరుగుతుందని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన నిర్మలా సీతారామన్‌ చెప్పుకొచ్చారు.
* ముంబయి మునుగుతుంటే.. మీరెక్కడున్నారు?
గత వారం రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న వర్షాలకు రాష్ట్రం పలు కష్టాలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్షాల ధాటికి రాజధాని ముంబయిలో రహదారులపై భారీ ఎత్తున నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రత్నగిరి జిల్లాలో ఆనకట్ట తెగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ముంబయి కష్టాల్లో ఉంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆ రాష్ట్ర నేతలను ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టాలని, కూటములపై కాదని స్పష్టం చేశారు. పరువు నష్టం కేసులో నిన్న ఆయన ముంబయి కోర్టులో హాజరైన విషయం తెలిసిందే. రూ.15,000 పూచీకత్తుపై ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం ఆయన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబయిలో వర్షాల సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజలకు సాయం చేయకపోవడంపై మండిపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..
*వాళ్లే దాడులు చేసి మాపై రుద్దుతున్నారు: మంత్రి బొత్స
అసెంబ్లీ భవనంలో ఎలాంటి వసతుల్లేవని, అసలు ఓ ప్రణాళికనేదే లేకుండా నిర్మించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సందర్శకులు వచ్చినా కనీస సదుపాయాలు ఉండటం లేదన్నారు.అసెంబ్లీలో ఛాంబర్ల మార్పు, వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో చర్చించామన్నారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చంద్రబాబు యాత్రలు దొంగే దొంగ అన్నట్లున్నాయని ఆరోపించారు. వాళ్లే దాడులు చేసి తమపై రుద్దుతున్నారని బొత్స విమర్శించారు.
*రాజీవ్ స్మృతి భవన్ దుస్థితి చూస్తే బాధగా ఉంది: వీహెచ్
బీచ్‌లోని రాజీవ్ స్మృతి భవన్‌ను మాజీ రాజ్య సభ సభ్యుడు వి హనుమంతరావు సందర్శించారు. రాజీవ్ స్మృతి భవన్ దుస్థితి చూస్తే బాధగా ఉందన్నారు. రాజీవ్ చివరి సారిగా నడయాడిన నేల అని.. అందుకే విశాఖలో ఈ భవన్ నిర్మాణం చేశామన్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం దీనిని కూల గొట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసిందని…ఇది మంచిది కాదన్నారు.
‘మీ తండ్రికి రాజీవ్ కుటుంబం రెండు సార్లు సీఎంగా అవకాశం ఇచ్చింది.. అలాంటి రాజీవ్ స్మృతి భవనం తొలగించే ఆలోచన సరికాదు’ అని జగన్‌ను ఉద్దేశించి వీహెచ్ వ్యాఖ్యానించారు. ముందు ప్రజలకు ఇచ్చిన హమీలపై దృష్టి పెట్టాలి కానీ కూల గొట్టాలనే ధోరణి సరికాదని ప్రజల తరపున రిక్వెస్ట్ చేస్తున్నానని వీహెచ్ పేర్కొన్నారు.
*లోక్‌సభలో వైకాపా, తెదేపా వాగ్వాదం
వైకాపా, తెదేపా సభ్యుల వాగ్వాదానికి లోక్‌సభ వేదిక అయింది. గురువారం లోక్‌సభలో ఆధార్‌ సవరణ బిల్లుపై చర్చలో భాగంగా వైకాపా సభ్యుడు కోటగిరి శ్రీధర్‌, తెదేపా లోక్‌సభాపక్ష నేత రామ్మోహన్‌నాయుడు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ముందుగా మాట్లాడిన కోటగిరి శ్రీధర్‌ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతి పెద్దదైన ఆధార్‌ సమాచారం లీక్‌ ఘటన జరిగింది. తెదేపా ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసాధికారిక, స్మార్ట్‌ పల్స్‌ పేరుతో సర్వే నిర్వహించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థŸంగా నిర్వహిస్తామంటూ 1.26 కోట్ల కుటుంబాల సామాజిక, ఆర్థిక సమాచారం సేకరించింది.
*అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
అబద్ధపు ప్రచారం చేసి ప్రత్యర్థులపై బురదజల్లడంతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధహస్తుడని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. అక్రమ సంబంధాల గొడవలను కూడా రాజకీయ హత్యలుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడం, పార్టీ ఫిరాయింపులు, క్యాంపు రాజకీయాలతో చంద్రబాబు వ్యవస్థల్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. రైతులకు విత్తన పంపిణీ, విద్యుత్‌ సరఫరాపై తెదేపా నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయన్న భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.
*పార్టీ శ్రేణుల రక్షణకు విభాగం -నారా లోకేశ్‌ వెల్లడి
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ‘ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలపై అధికార వైకాపా శ్రేణులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేశాం’ అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
*అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
అబద్ధపు ప్రచారం చేసి ప్రత్యర్థులపై బురదజల్లడంతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధహస్తుడని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. అక్రమ సంబంధాల గొడవలను కూడా రాజకీయ హత్యలుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడం, పార్టీ ఫిరాయింపులు, క్యాంపు రాజకీయాలతో చంద్రబాబు వ్యవస్థల్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. రైతులకు విత్తన పంపిణీ, విద్యుత్‌ సరఫరాపై తెదేపా నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయన్న భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.
*తెరాస పాలనతో ప్రజలు విసిగిపోయారు
ప్రజలు తెరాస అవినీతి పరిపాలన, కేసీఆర్‌ కుటుంబ పాలన పట్ల విసిగిపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, హైదరాబాద్‌లకు చెందిన పలువురు నేతలు భాజపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భవిష్యత్‌ భాజపాదేనని అన్నారు.
*పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్‌, ఏచూరి
పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం ముంబయిలోని మెట్రోపాలిటిన్‌ కోర్టుకు హాజరయ్యారు. తమపై చేసిన ఆరోపణలు సరికావని తాము విచారణను ఎదుర్కోడానికి సిద్ధమని వారు కోర్టుకు తెలిపారు. పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్యకు భాజపా, ఆర్ఎస్ఎస్‌ భావజాలంతో ఉన్న వారే కారణమని రాహుల్‌గాంధీ పేర్కొన్నారని ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్‌కు చెందిన న్యాయవాది ధ్రుతిమాన్‌ జోషీ పరువునష్టం దావా వేశారు.
*దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం రద్దు
దేశ రాజధాని దిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి నియామకాన్ని రద్దు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకానికి సంబంధించి జూన్‌ 22న జారీ చేసిన జీవో నెం.68ని తక్షణం రద్దు చేస్తున్నట్టు పేర్కొంది
*నా అరెస్టుకు రాజకీయ కుట్ర: గద్దర్‌
తనను అరెస్టు చేయడానికి రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రజా గాయకుడు గద్దర్‌ ఆరోపించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో భార్య విమలతో కలిసి మాట్లాడారు. ‘ఎప్పుడో 2005లో కర్ణాటకలోని తుమకూరు నక్సల్‌ దాడికేసులో వరవరరావుతో పాటు నా పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉందని సమాచారం. తీరా ఇప్పుడు 14 ఏళ్ల అనంతరం కేసును తిరగదోడిన ఆ రాష్ట్ర పోలీసులు..ఇంతకాలం నేను అజ్ఞాతంలో ఉన్నట్లు పేర్కొనడం ఏమిటి’ అని ప్రశ్నించారు. 1990లో ప్రజాజీవితంలోకి వచ్చిన తాను 1993 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానన్నారు. 1997లో తనపై హత్యాయత్నం జరగడంతో, ఆ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ సాగిందన్నారు.
*దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం రద్దు
దేశ రాజధాని దిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి నియామకాన్ని రద్దు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకానికి సంబంధించి జూన్‌ 22న జారీ చేసిన జీవో నెం.68ని తక్షణం రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.