Politics

అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త

అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త

అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అందులో అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల వయస్సును నిర్దేశించారు.ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000 అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు చేయనున్నారు. దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ముందుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటె, ఈరోజు భ‌ద్రాద్రి క‌లెక్ట‌ర్ ప్రియాంక ఆల కూడా త‌న కుమారుడు కైరాను అంగ‌న్‌వాడీ సెంట‌ర్‌లో శుక్ర‌వారం చేర్పించారు. అర గంట పాటు అంగ‌న్‌వాడీ కేంద్రంలోనే ఉన్న క‌లెక్ట‌ర్.. పిల్ల‌ల‌కు బోధించే తీరును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌ల‌కు టీచ‌ర్లు ఆట‌పాట‌లు నేర్పించారు. క‌లెక్ట‌ర్ కూతురు మైరా కూడా అంగ‌న్‌వాడీ కేంద్రానికి వ‌చ్చారు.