Business

కాకినాడ బీచ్ లో మ్యూజియం ఎప్పుడో?

కాకినాడ బీచ్ లో మ్యూజియం ఎప్పుడో?

కాకినాడ జిల్లా కాకినాడ సముద్రతీరంలో సందర్శకులకు ఎంతో ఆకర్షణీయంగా, కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేసిన పర్యాటక యుద్ద విమాన గేటుకు తాళాలు వేయడంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దగ్గరికి వెళ్లి యుద్ధం విమానాన్ని పర్యాటకంగా తిలకించేందుకు వీలు లేకపోవడంతో ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్నారు.కాకినాడ జిల్లా కాకినాడ సముద్రతీరంలో సందర్శకులకు ఎంతో ఆకర్షణీయంగా, కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేసిన పర్యాటక యుద్ద విమాన గేటుకు తాళాలు వేయడంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దగ్గరికి వెళ్లి యుద్ధం విమానాన్ని పర్యాటకంగా తిలకించేందుకు వీలు లేకపోవడంతో ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రం నలుమూలల నుండి సముద్ర తీరానికి రోజు వేలాది మంది సందర్శకులు సేదతీరడానికి వస్తూ ఉంటారు. చక్కని వాతావరణం ఉంది. అందుకు తగ్గ ప్రదేశాలతో చూడదగినవి ఏర్పాటు చేశారు.కాకినాడ రూరల్లో ఎన్టీఆర్ బీచ్, గ్లాస్ బ్రిడ్జి, శిల్పారామం వంటివి కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేశారు.అలాగే సూర్యారావుపేట బీచ్‌లో కూడా రూ. 4.96 కోట్లతో పార్కును నిర్మించారు. ఆ పార్కులో ప్యాసింజర్ విమానం, యుద్ధవిమానంతో పాటు చిన్న పిల్లలను ఆకర్షించే పలు రకాల పండ్ల ఆకృతులను నిర్మించారు.

పార్కు అభివృద్ధికి నోచుకోకుండా, ప్రారంభోత్సవం చేయకుండా దాచిపెట్టారు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఆ పార్కు లోకి వెళ్ళకుండా గేటుకి తాళాలు వేయడంతో కోట్లాది రూపాయలతో నిర్మించిన పార్కులో ఏర్పాటు చేసిన యుద్ధ విమానంతో పాటు పండ్ల ఆకృతులు బూజు పట్టి, తుప్పు పట్టి పాడై పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆహ్లాదకర వాతావరణంలో గేట్లకు వేసిన తాళాలను తెరిచి ఉంచాలని కోరుతున్నారు.కాకినాడ బీచ్ పార్క్‌లో పరిస్థితులు చాలా ధైన్యంగా ఉన్నాయనీ, దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబు, స్థానిక ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ దృష్టిసారించి వాటికి మోక్షం కలిగించి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని పర్యాటకులు వేడుకుంటున్నారు.