యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు న్యాయస్థానాన్ని సీబీఐ సమయం కోరింది. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. జగన్ పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.మరోవైపు, విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ వేశారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయాన్ని కోరింది. విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.