శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపుతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో.. సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే.. గాలింపు అనంతరం చివరకు బాంబు లేదని నిర్ధారించారు. సదరు ఆగంతకుడు మెయిల్ చేయగా.. అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. అయితే.. బాంబు లేదని నిర్ధారించుకున్న అధికారులు అదొక ఫేక్‌కాల్‌గా తేల్చారు. మరోవైపు బెదిరింపు కాల్ చేసిన ఆగంతకుడి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు.