గిడుగు వెంకటరామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని దక్షిణాఫ్రికాలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫ్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు.
తెలుగు భాష ఔన్నత్యం, అవసరం తెలిసేలా వ్యాస రచన, పద్యాలు, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. దక్షిణాఫ్రికాలో తెలుగు భాషాసాహిత్యాల అభివృద్ధికి,వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న రాపోలు సీతారామరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ కుప్పు రాజు, తాళ్ళూరి శ్రీనివాస్, గరిశె కృష్ణారెడ్డి, శ్రీరాముల గుమ్మడి, బండారు మురళి, నాని నిర్మల్, యెలిగేటి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.