Devotional

ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి

ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 30.08.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (30-08-2023)

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (30-08-2023)

బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనఃస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. శివారాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (30-08-2023)

కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఇష్టదైవ ప్రార్థన మంచిది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (30-08-2023)

కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివనామస్మరణ శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (30-08-2023)

శుభ ఫలితాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. శ్రీలక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (30-08-2023)

అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (30-08-2023)

ముందుచూపుతో వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (30-08-2023)

ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్ట దైవ సందర్శనం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (30-08-2023)

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. శ్రీగణపతి స్తోత్రం చదవండి,మంచి జరుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (30-08-2023)

శుభ కాలం. ఏ పనులు ప్రారంభించినా త్వరగా పూర్తవుతాయి. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (30-08-2023)

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (30-08-2023)

పెద్దల అశీస్సులు మిమ్మల్ని రక్షిస్తాయి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాధ్యానం శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈