టీచర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ రెండో వారంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. దరఖాస్తుల సంఖ్యను బట్టి షిఫ్ట్ ల వారీగా CBT పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన 6,612 పోస్టులకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు, షెడ్యూల్ తో కూడిన జీవో విడుదల కానుండగా, ఆ తర్వాత వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం.కాగా, సెప్టెంబర్ 5 నుంచి పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు, సెప్టెంబర్ 23న ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 26న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 29లోగా తమకు వచ్చిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అటు అక్టోబర్ 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది.