Politics

వివేకా కేసు విచారణ వాయిదా

వివేకా కేసు విచారణ వాయిదా

 వివేకా హత్య కేసులో నేడు సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టుకి హాజరు కావడం ఇది రెండో సారి. ఇప్పటికే వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిపై సీబీఐ చార్జిషీట్ వేసింది. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా సీబీఐ అవినాష్ రెడ్డిని చేర్చింది. వివేకా హత్య కేసులో 145 పేజీలతో మూడో ఛార్జ్ షీట్ సీబీఐ దాఖలు చేసింది. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఏడుగురు నిందితులను కోర్టు ముందు పోలీసులు హాజరు పరిచారు. గంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ శంకర్ రెడ్డి, దేవిరేడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను హాజరు పరచడం జరిగింది. తదుపరి విచారణ 22 కి వాయిదా పడింది.