* తిరుమలలో వసతి గదుల ధర తగ్గింపు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. తిరుమల అష్ట వినాయక అతిధి గృహాన్ని సామాన్య భక్తులుకు కేటాయించేలా వాటి ధరను 150 రూపాయలకు తగ్గిస్తూన్నామని టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి ప్రకటించారు. వికాస్ నిలయంలో అతిధి గృహాని 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికరణ చేస్తూన్నామని చెప్పారు టీటీడీ పాలక మండలి ఇఓ దర్మారెడ్డి.ఆగస్ట్ నెలలో 22.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా….హుండి ద్వారా 120.05 కోట్లు ఆదాయం లభించిందని పేర్కొన్నారు. కోటి తోమ్మిది లక్షల లడ్డులు విక్రయించాయని…43.07 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని చెప్పారు. 9.07 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఇఓ దర్మారెడ్డి ప్రకటించారు. తిరుమల శ్రీవారి అభిషేకాని వినియోగించే పాలను టిటిడి గోశాల నుంచి సేకరిస్తూన్నామన్నారు ఇఓ దర్మారెడ్డి.
* అమెజాన్ ఫ్రెష్ ఆఫర్స్ సరికొత్త
పండుగల సీజన్ మొదలవుతుండటంతో తమ వినియోగదారుల కోసం అమెజాన్ ఫ్రెష్ సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్ పేరుతో ఓ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ద్వారా తాజా పండ్లు, కూరగాయలు, కిరాణా సామాగ్రి, రోజువారీ నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.వాటితోపాటు ప్యాకేజ్డ్ ఫుడ్స్, పర్సనల్ కేర్, బేబీ కేర్, పెట్ కేర్ ఉత్పత్తులపై 45% వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా కొన్ని బ్యాంకు కార్డులపై అమెజాన్ రాయితీ ఇస్తోంది. కస్టమర్స్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ కార్డ్‌లపై 10% డిస్కౌంట్, సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. కొత్త కస్టమర్‌లకు తమ మొదటి నాలుగు ఆర్డర్లపై రూ.400 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. పాత కస్టమర్లకు తమ తదుపరి అమెజాన్ ఫ్రెష్ ఆర్డర్‌పై రూ.150 వరకు క్యాష్ బ్యాక్‌ను అందనుంది. జన్మాష్టమి సందర్భంగా అమెజాన్ ఫ్రెష్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూలు అందుబాటులో ఉంచారు. ఆయిల్ ప్యాకెట్స్, స్వీట్స్, డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, జ్యూసెస్ కూడా ఈ ఆఫర్లో అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వెంటనే అమెజాన్.ఇన్‌లో షాపింగ్ చేసేయండి.
* ఆగస్టులో యూపీఐ ట్రాన్సక్షన్స్ సరికొత్త రికార్డ్
ఆధునిక భారతదేశంలో జేబులో డబ్బుపెట్టుకునే వారి సంఖ్యకంటే కూడా యూపీఐ వినియోగించేవారి సంఖ్యే ఎక్కువగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిల్లరకొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా దాదాపు అన్నీ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ విధానం గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2023 ఆగస్టు 30 నాటికి యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. దీని విలువ సుమారు 15.18 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఈ ట్రాన్సక్షన్స్ జులై నెలలో 9.88 బిలియన్స్. అంటే జులై నెల కంటే కూడా ఆగష్టు నెలలో లావాదేవీలు చాలా ఎక్కువ జరిగినట్లు స్పష్టమవుతోంది.నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, జూలైలో 9.88 బిలియన్ డాలర్లు, ఆగష్టులో 10 బిలియన్లు అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగ సీజన్ కావున తప్పకుండా యూపీఐ లావాదేవీలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
* ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్
ఎన్‌ఫీల్డ్ లవర్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350’ బైక్ ఇండియా మార్కెట్లో ఈ రోజు విడుదలైంది. ఇది మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో మిలిటరీ కలర్ వేరియంట్ ధర రూ. 1.73 లక్షల నుండి ప్రారంభమవుతుంది, స్టాండర్డ్ వెర్షన్‌కి రూ. 1.97 లక్షలు, టాప్-టైర్ బ్లాక్ గోల్డ్ వేరియంట్‌కి రూ.2.16 లక్షలు. ఈ బైక్ బుకింగ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.బుల్లెట్ 350 బైక్ 349 cc ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇంజన్ J-ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నిర్మించారు. ఇది 20 bhp పవర్, 27 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను దీనిలో అందించారు. సస్పెన్షన్ పరంగా ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. కొత్త డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. దీనిలో LCD ఇన్ఫో ప్యానెల్, USB చార్జింగ్ పోర్ట్ హ్యాండిల్‌బార్ , పెట్రోల్ ఇంటికేటర్ మొదలగు ఫీచర్స్ ఉన్నాయి.
* సిమ్ కొనుగోలుదారులు జాగ్రత్త
మొబైల్ వాడకం బాగా పెరిగింది. మొబైల్ ఉపయోగించడానికి సిమ్ కార్డ్ కూడా అవసరం. సిమ్ కార్డ్ లేకుండా ప్రజలు మొబైల్ నుండి కాల్ చేయలేరు. అయితే ఇప్పుడు ప్రభుత్వం సిమ్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను జారీ చేసింది. దీని కింద రూ.10 లక్షల జరిమానా కూడా విధించవచ్చు. 10 లక్షల జరిమానా విధిస్తుందంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వాస్తవానికి కొత్త నిబంధనల ప్రకారం.. రిజిస్టర్ కాని విక్రేతల ద్వారా సిమ్ కార్డులను విక్రయించినందుకు టెలికాం కంపెనీలకు రూ.10 లక్షల జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ విభాగం గురువారం ఒక సర్క్యులర్‌లో వెల్లడించింది. సిమ్ కార్డుల మోసపూరిత విక్రయాలను అరికట్టేందుకు రూపొందించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని టెలికమ్యూనికేషన్స్ విభాగం తెలిపింది. టెలికాం కంపెనీలు సెప్టెంబర్ 30లోపు తమ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్)లన్నింటినీ నమోదు చేసుకోవాలి.నకిలీ సిమ్ కార్డుల ద్వారా నేరాలు చేసే అవకాశం ప్రజలకు కలుగుతుంది. దీన్ని కూడా అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త ముందడుగు వేసింది. సర్క్యులర్ ప్రకారం, “సెప్టెంబర్ 30 తర్వాత ఏదైనా కొత్త POS నమోదు చేయకుండానే లైసెన్సుదారు కస్టమర్‌లను నమోదు చేసుకోవడానికి అనుమతిస్తే, సంబంధిత లైసెన్స్ సర్వీస్ ఏరియా ప్రతి లైసెన్స్‌దారుపై POSకి రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధిస్తుంది.” నమోదుకాని విక్రయ కేంద్రాల ద్వారా యాక్టివేట్ చేయబడిన అన్ని మొబైల్ కనెక్షన్‌లు కూడా ప్రస్తుత నిబంధనల ప్రకారం తిరిగి ధృవీకరించబడతాయి.ఇప్పటికే ఉన్న అన్ని సిమ్ విక్రయ కేంద్రాలు కూడా పత్రాలను సమర్పించి సెప్టెంబర్ చివరిలోపు నమోదు చేసుకోవాలి. అయితే, రీఛార్జ్/బిల్లింగ్ కార్యకలాపాల కోసం మాత్రమే నియమించబడిన POS నమోదు అవసరం లేదు. రిటైలర్ రిజిస్ట్రేషన్ కోసం కార్పొరేట్ గుర్తింపు సంఖ్య (CIN), పరిమిత బాధ్యత భాగస్వామ్య గుర్తింపు సంఖ్య (LLPIN) లేదా వ్యాపార లైసెన్స్, ఆధార్ లేదా పాస్‌పోర్ట్, PAN, వస్తు సేవల పన్ను (GST) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను అందించాలి.
* ఇండియాలో లక్షల వీడియోలు రద్దు యూట్యూబ్
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ భారతదేశంలో జనవరి – మార్చి 2023 మధ్య 1.9 మిలియన్లకు పైగా వీడియోలు తీసివేశారు. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ యూట్యూబ్ (YouTube) 6.48 మిలియన్లకు పైగా వీడియోలను తీసివేసింది.కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పొందే ఫ్లాగ్‌లు, పాలసీలను ఎలా అమలు చేస్తుందనే దానిపై గ్లోబల్ డేటాను అందిస్తుంది. జనవరి – మార్చి 2023 మధ్య భారతదేశంలో యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 1.9 మిలియన్లకు పైగా వీడియోలు తీసివేసింది. USలో 6లక్షల 54వేల 968, రష్యాలో 4లక్షల 91వేల 933, బ్రెజిల్ లో 4లక్షల 49వేల 759 వీడియోలు తీసివేసింది,”ఒక కంపెనీగా ప్రారంభ రోజుల నుంచి, మా కమ్యూనిటీ మార్గదర్శకాలు YouTube కమ్యూనిటీని హానికరమైన కంటెంట్ నుంచి రక్షించాయి. మేము మెషిన్ లెర్నింగ్, హ్యూమన్ రివ్యూయర్‌ల కాంబినేషన్ ను ఉపయోగించి మా విధానాలను అమలు చేస్తాం” అని YouTube తెలిపింది. కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 మొదటి త్రైమాసికంలో YouTube 8.7 మిలియన్ ఛానెల్‌లను తీసివేసింది. ఈ సమయంలోనే 853 మిలియన్ కంటే ఎక్కువ కామెంట్స్ ను తీసివేసింది. వీటిలో ఎక్కువ భాగం స్పామ్‌గా ఉన్నాయి. తీసివేసిన కామెంట్స్ లో 99 శాతం ఆటోమేటిక్‌గా గుర్తించబడ్డాయి.
* మరో కంపెనీని వదిలించుకునేందుకు సిద్ధమైన మోదీ సర్కార్
మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్నది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఇంకో కంపెనీని వదిలించుకునే పనిలో మోదీ సర్కారు నిమగ్నమైంది. ఈసారి ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపీసీఎల్) వంతు వచ్చింది. అక్టోబర్ 15కల్లా కంపెనీ కొనుగోలుపై ఆసక్తిని వ్యక్తపర్చాలంటూ (ఈవోఐ) బిడ్డర్లను గురువారం కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది కూడా. ఐఎంపీసీఎల్‌లో కేంద్రానికి 98.11 శాతం వాటా ఉన్నది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పాలనలో ఇది పని చేస్తున్నది. మిగతా 1.89 శాతం వాటా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి చెందిన కుమావోన్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (కేఎంవీఎన్‌ఎల్)కు ఉన్నది. ‘మేనేజ్‌మెంట్ కంట్రోల్ బదిలీతో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఐఎంపీసీఎల్‌లో ఉన్న మొత్తం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని భావిస్తున్నది. సంస్థలో తమకున్న కొద్దిపాటి వాటాను అమ్మేందుకు కేఎంవీఎన్‌ఎల్ కూడా సుముఖంగానే ఉన్నది’ అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) తెలిపింది.ఐఎంపీసీఎల్ ప్రస్తుతం వివిధ వ్యాధుల నయానికి వెయ్యికిపైగా ఔషధాలను తయారు చేస్తున్నది. ఇందులో 656 క్లాసికల్ ఆయుర్వేదిక్, 332 యునానీ, 71 ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అంతేగాక దేశవ్యాప్తంగా 6వేల జన ఔషధి కేంద్రాలకు, నేషనల్ ఆయుష్ మిషన్ కింద అన్ని రాష్ర్టాలకు ఆయుర్వేద, యునానీ ఔషధాలను ఐఎంపీసీఎల్ సరఫరా చేస్తున్నది. ఇదిలావుంటే గత ఏడాది మార్చి 31నాటికి కంపెనీ పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ రూ.51.98 కోట్లుగా ఉన్నది. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో 35.81 ఎకరాల విస్తీర్ణంలో ఐఎంపీసీఎల్‌కు ఓ క్యాంపస్ కూడా ఉన్నది. ఐఎంపీసీఎల్.. మొదలైన దగ్గర్నుంచీ లాభాల్లోనే నడుస్తున్నది. అయినప్పటికీ దీన్ని వదిలించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ పన్నులు చెల్లించక ముందు లాభం రూ.42.77 లక్షలుగా ఉన్నది. 2021-22లో ఇది ఏకంగా రూ.45.41 కోట్లకు పెరిగింది. కేవలం రెండేండ్లలో ఎన్నో రెట్ల లాభాలను పెంచుకున్నది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి రూ.9.93 కోట్ల డివిడెండ్‌నూ చెల్లించింది. అయినప్పటికీ ఈ కంపెనీని వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో మోదీ సర్కారు ప్రైవేట్‌పరం చేస్తుండటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది.
* వన్‌ఫ్లస్ నార్డ్ సీఈ3 5జీ నాడ్ బడ్స్ 2ఆర్ కోసం వివిధ ఆఫర్స్
కిందటి నెలలో లాంచ్ చేసిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 5జీ, నాడ్ బడ్స్ 2ఆర్ కోసం వివిధ ఆఫర్లను వన్‌ప్లస్ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, డెబిట్ కార్డు ఈఎంఐ, వన్‌క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, యాక్సిస్ బ్యాంక్, సిటీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఇయర్‌బడ్స్‌పై అయితే రూ.200 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
* అదానీ గ్రూప్‌పై మళ్లీ ఆరోపణలు
అదానీ గ్రూప్ పై మరోసారి పిడుగుపడింది. మళ్లీ ఆ సంస్థపై అక్రమ పెట్టుబడులు ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈసారి ఈ ఆరోపణలు చేసింది ఆర్గనైజ్‌డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్‌పీ). అదానీ గ్రూప్ కంపెనీల్లో అజ్ఞాత విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలు చేస్తోంది. యాక్టివ్ గా లేని మారిషస్ ఫండ్స్ ద్వారా కోట్లాది డాలర్లను గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా అదానీ షేర్ విలువ కోట్లకు కోట్లు పెరుగుతుందని తెలిపింది. యూఏఈకి చెందిన నాసెర్ అలీ షాబాన్ అలీ, తైవాన్‌కు చెందిన చాంగ్ చుంగ్–లింగ్ ఈ అక్రమ ట్రాన్సక్షన్లలో కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. వీరిద్దరూ కొన్ని కోట్ల డాలర్ల పెట్టుబడులతో అదానీ గ్రూప్ స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహించినట్లు ఓసీసీఆర్‌పీ తాజాగా ఆరోపణలు గుప్పించింది.ఇదిలా వుండగా ఈ ఏడాది జనవరిలోనూ అదానీ గ్రూప్ కంపెనీలలో అకౌంటింగ్ అవకతవకలు జరుగుతున్నట్లు యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల కారణంగా అదానీ షేర్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. అయితే ఈ ఆరోపణలపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన సెబీ షేర్ల ధరల్లో అవకతవకలకు ఆధారాలు లేవంటూ సుప్రీంకు తెలిపింది. అదానీ కంపెనీలక క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే తాజాగా మరోసారి ఓసీసీఆర్‌పీ అదానీ కంపెనీలపై అవకతవకల ఆరోపణలు చేసింది.అయితే ఈ ఆరోపణలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. అదానీ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. అయితే అదానీ కంపెనీకి సెబీ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కూడా తప్పుబట్టిన రాహుల్ రుజువులు ఇచ్చినా సెబీ రాహుల్ కు క్లీన్ చిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. క్లీన్ చిట్ ఇచ్చిన సెబీలోని ఆ వ్యక్తి ఇప్పుడు అదానీ కంపెనీకి చెందిన ఎన్డీటీవీలో డైరెక్టర్ గా ఉన్నారని, దీన్ని బట్టే విచారణ ఏవిధంగా జరిగిందో అర్థమవుతుందని రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయం గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని రాహుల్ కోరారు.ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. ఓసీసీఆర్‌పీ ఆరోపణల నివేదికలో పేర్కొ న్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను గురించి సుప్రీం కోర్టు నియమించిన కమిటి దర్యాప్తులో పేర్కొందని తెలిపింది. అయిపోయిన విషయాన్నే మళ్లీ తవ్వి ఆరోపణలు చేస్తున్నారని ఇవి రీసైకిల్ చేసినవంటూ కొట్టిపారేసింది. పసలేని విషయాలపై విదేశీ మీడియా రాద్దాంతం చేస్తుందని ఇది ముందుగానే ఊహించిందని కంపెనీ పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయిలో వివరణ ఇస్తూ ఒక మీడియా స్టేట్మెంట్ విడుదల చేసింది.విదేశీ సంస్థలు తమ ప్రయత్నాల ద్వారా అదానీ గ్రూప్ స్టాక్ ధరలను తగ్గించి తద్వారా లాభాలను ఆర్జించడం కోసం ప్రయత్నిస్తున్నాయని తన ప్రకటనలో వెల్లడించింది అదానీ గ్రూప్. అయితే త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఉండనుండగా మళ్లీ అదానీ గ్రూప్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఎటువంటి చర్చకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు.
* నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి మీద ధరను పోల్చి చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు పెరిగి రూ.55,150 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.160 కు పెరిగి రూ.60,160 గా ఉంది. నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,150 ,24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,160.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,150,24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,160.