WorldWonders

ఉత్తరప్రదేశ్‌లో ఓ తల్లి గ్రహాంతరవాసి లాంటి బిడ్డకు జన్మనిచ్చింది

ఉత్తరప్రదేశ్‌లో ఓ తల్లి గ్రహాంతరవాసి లాంటి బిడ్డకు జన్మనిచ్చింది

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఏలియన్‌ లాంటి పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది. చర్మంపై పలు చోట్లు పగుళ్లు కనిపిస్తున్నాయి. కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వింత శిశు జననం స్థానికంగా సంచలనం కలిగించింది. కాగా ఇటువంటి శిశువును హాలోక్విన్‌ ఇథియోసిస్‌ బేబీ అని అంటారని వైద్యులు తెలిపారు.

కాగా ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వింతవింత శబ్ధాలు చేస్తున్నాడు. సాధారణంగా ఇటువంటి శిశువులు జన్మించిన వెంటనే చనిపోతారని వైద్యులు తెలిపారు. అయితే ఈ శిశువు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బేహడీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజుల క్రితం పురిటి నొప్పులతో ఒక ఆసుపత్రిలో చేరింది. ఆగస్టు 30న ఆమెకు నార్మల్‌ డెలివరీ జరిగింది.

అప్పుడే జన్మించిన శిశువును చూడగానే తల్లి హడలెత్తిపోయింది. పిల్లాడు ఏలియన్‌ మాదిరిగా ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా డాక్టర్‌ వినోద్‌ పాగ్‌రానీ మాట్లాడుతూ ఇలా జన్మించే శిశువును హాలోక్విన్‌ ఇథియోసిస్‌ బేబీ అని అంటారని, ఈ స్థితిలో జన్మించే శిశువుల చర్మంలో తైలగ్రంథులు ఉండవని, ఫలితంగా చర్మం పగిలిపోతుందన్నారు. మూడు లక్షల శిశు జననాలలో ఒకటి ఈ విధంగా ఉండవచ్చన్నారు. ఇటువంటి శిశువు ఎక్కువకాలం జీవించదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి శిశువులు ఐదారురోజుల వరకూ జీవిస్తారని పేర్కొన్నారు.