* ఒడిశాలో పిడుగుల వర్షంలో 10 మంది మృతి
ఒడిశాలో పిడుగుల వర్షంలో 10 మంది మృతి చెందారు. మరో ముగ్గురు మృతి చెందారు. ఒడిశాలోని ఆరు జిల్లాల్లో పిడుగుల వర్షంతో ప్రజలు తీవ్రంగా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.శనివారం నాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పిడుగుల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. పిడుగుపాటుకు ఖుర్దా జిల్లాలో నలుగురు, బోలంగిర్ లో ఇద్దరు. అంగుల్, బౌధ్, జగత్ సింగ్ పూర్, ధెంకనల్ లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో వైపు ఖుర్దాలో పిడుగుపాటుకు మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు వివరించారు. భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. భువనేశ్వర్, కటక్ లలో 90 నిమిషాల వ్యవధిలోనే 126 మి.మీ. 95.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో పిడుగులు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల మూడో తేది నీటికి మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ హెచ్ఆర్ బిశ్వాస్ చెప్పారు.
* పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన తల్లి
కన్న తల్లి బిడ్డల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. పిల్లలను పెంచడం కోసం ఎన్ని కష్టాలనైనా పడుతుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే తల్లి వారికి చిన్న గాయమైనా తల్లడిల్లిపోతుంది. అందుకే అమ్మ అంటే అందరికి ఇష్టం, గౌరవం. లోకంలో చెడ్డ బిడ్డలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు. అయితే రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. కొంతమంది అమ్మ అనే పేరుకే కలంకం తెస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను పుట్టగానే చెత్త కుప్ప లేదా మురికి కాలువ పాలు చేస్తూ కనికరం లేకుండా ప్రవర్తిస్తు్న్నారు. పురిటి నొప్పులు పడి కని కూడా కసాయిలా ప్రవర్తిస్తున్నారు. ఏ మాత్రం జాలి, దయ లేకుండా పొత్తిళ్లలో ఉంచి కాపాడుకోవాల్సిన పసికందులను పొదల్లో పడేస్తున్నారు. తాజాగా ఇలాంటి సమాజం తలదించుకోవాల్సిన ఘటనే చిత్తూరులో జరిగింది. పురిటిబిడ్డను మురికి కాలువలో పడేసి వెళ్లిపోయింది ఓ తల్లి.వివరాల ప్రకారం పలమనేరు కేవీఎస్ స్ట్రీట్ లో ఓ పసికందు ఏడుపు వినిపించింది. దీంతో అక్కడికి వచ్చి చూసిన స్థానికులు మురికి కాలువలో పసిగుడ్డును చూసి ఆశ్చర్యపోయారు. మురికి కాలువలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పసికందును బయటకు తీశారు అక్కడి స్థానికులు. దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పసిపాప పరిస్థితి చూసి అక్కడి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే చిన్నారిని పలమనేరు ఆసుపత్రి తీసుకు వెళ్లి చికిత్స చేయిస్తున్నారు కొందరు యువకులు. అయితే పాపను ఎవరు పడేశారు, ఎందుకు పడేశారు అనే విషయాలు తెలియరాలేదు. ఆడపిల్ల కావడం వల్ల వదిలించుకోవడానికి పడేశారా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసలు విచారిస్తున్నారు. పాప పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
* ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ
అర్ధరాత్రి సమయంలో గాడ నిద్రలో ఉండగా లారీ ఇంటిపైకి దూసుకెళ్లడంతో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి నుంచి కట్టల లోడ్డుతో లారీ శుక్రవారం రాత్రి బయలుదేరింది. సేతుపట్టు సమీపంలోని నంబేడు వద్ద వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంటిని అతివేగంగా ఢీకొంది.ఆ సమయంలో ఇంటిలో గాఢనిద్రలో ఉన్నవారిపై గోడలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో మునియప్పన్, భార్య జయలక్ష్మి, కుమారుడు ఏయుమలై, కోడలు సుగన్య ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న వారు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సేతుపట్టు పోలీసులు కేసు నమోదు చేసి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
* కుమారుడి మృతి కొడుకు జ్ఞాపకాలతో తల్లి ఆత్మహత్య
రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు, కుమారుడు ప్రాణాలు కోల్పోతే.. ఆ బాధను అనుభవించే వారి పరిస్థితి ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోళ్లబైలు పంచాయితీ కాట్లాటపల్లెకు చెందిన ఓబుల్ రెడ్డి, రమణమ్మ భార్యాభర్తలు. వీరికి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి, కుమార్తె మనీషా వున్నారు. కుమార్తెకు పెళ్లయి అత్తారింట్లో వుంటుంది.సంతోషంగా సాగిపోతున్న వీరి కుటుంబంలో అనుకోని కుదుపు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఈ ఏడాది మార్చిలో కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చెట్టంత ఎదిగిన కుమారుడు ఇక లేడని తెలిసి , అతని జ్ఞాపకాలు నిండిన ఇంట్లో జీవించలేక ఓబుల్ రెడ్డి దంపతులు మరో చోటికి మకాం మార్చారు. అయితే నెలలు గడవక ముందే గత నెల 11న ఓబుల్ రెడ్డి భార్య రమణమ్మ కుమారుడి మృతిని తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలల వ్యవధిలో భార్య, కుమారుడు మరణించడంతో ఓబుల్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. మద్యానికి బానిసైన ఆయన శుక్రవారం ఇంటి బాత్రూమ్ సమీపంలో శవమై కనిపించాడు. అయితే దీనిని గమనించిన స్థానికులు హత్యగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తన సోదరుడి కుటుంబానికి రూ.3 కోట్ల విలువ చేసే పొలం వుందని.. ఆస్తి కోసం ఆయనను ఎవరైనా హత్య చేసి వుండొచ్చని మృతుడి సోదరుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో ఓబుల్ రెడ్డి తల వెనుక గాయం వుండటాన్ని పోలీసులు గుర్తించారు.
* బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరులోని బాలాజీ హైస్కూల్ వద్ద ఘటన జరిగింది. వినుకొండ నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.మృతులను నరసరావుపేటకి చెందినవారిగా గుర్తించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
* రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో కొకైన్ పట్టివేత
హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. పెద్దఎత్తున కొకైన్ తీసుకొస్తుండగా దర్యాప్తు సంస్థ పట్టుకొంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)కి అందిన విశ్వసనీయ సమాచారంతో విమానాశ్రయంలో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో 5 కిలోల కొకైన్ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.50 కోట్లు. ఓ సూట్‌కేస్‌తోపాటు మహిళలు వినియోగించే నాలుగు హ్యాండ్‌బ్యాగ్‌ల అడుగు భాగంలో ఈ సరకును పొడిరూపంలో ఉంచి తీసుకొచ్చారు. ఇవి లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడివిగా గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం తిరిగి దిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ రాకెట్‌లో ఇంకా ఎవరున్నారనేది దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్‌ఐ వర్గాలు ప్రకటించాయి.
* నేషనల్ హైవేపై లారీ దగ్ధం
ప్రమాదవశాత్తు డీసీఎం లారీ దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గురువాయిగూడెం సమీపంలో నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా నుండి హైదరాబాద్‌కు కెమికల్‌లోడ్‌తో వెళ్తున్న డీసీఎం లారీలో గురువాయిగూడెం రాగానే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో లారీ పూర్తిగా కాలిబూడిదైపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం కాగా, డ్రైవర్‌కు తోడుగా ఉన్న వాహన యజమానికి తీవ్ర గాయాలు అయ్యాయి.గమనించిన ఇతర వాహనదారులు ఆయన్ను బయటకు లాగి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనాదారులు పోలీసులకు, హైవే పెట్రో సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో లారీ చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
* హన్మకొండలో చెట్టును ఢీకొన్న టాటా ఏసీ
హన్మకొండలోని కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి టాటా ఏసీ.. చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటన ఆదివారం వేకువ జామున చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో హసన్ పర్తి మండలం పెంబర్తి కి చెందిన ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి.డ్రైవర్ కొయ్యడ రాకేష్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఇక గాయాల భారిన పడ్డ వారిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు స్థానికులు. ఈ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు… గాయపడ్డ వారు కోయ్యాడ రాకేష్, జోరిక సందీప్, మేకల జిధ్యన్, కక్కర్ల పృధ్వీ, పున్నం చందర్ గుర్తించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
* స్కూల్ బస్సులోనే బాలికపై సీనియర్ లైంగిక వేధింపులు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ బాలికపై తన సీనియర్ విద్యార్థి స్కూల్ బస్సులోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని ఉపసంహరించుకోవాలని స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఆమెకు ఒత్తిడి వచ్చింది. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ విషయంలో పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల, ‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. వాయవ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలిక బేగంపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటోంది. ఆ బాలిక ఎప్పటిలాగే ఆగస్టు 23వ తేదీన కూడా స్కూల్ కు వెళ్లింది. స్కూల్ బస్సులో తిరిగి తను నివాసం ఉంటున్న ప్రాంతానికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఆ బాలికపై సీనియర్ విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్దాడు.స్కూల్ బస్సు ఆమె నివాసం ఉండే సొసైటీ గేటు వద్దకు చేరుకుంది. ఆ బాలిక కోసం తల్లి అక్కడ ఎదురుచూస్తోంది. అయితే ఆ చిన్నారి మూత్రం కారణంగా బ్యాగ్ తడిసిపోయి ఉండటాన్ని తల్లి గమనించింది. దీంతో ఏం జరిగిందని ఆరా తీయగా.. బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి బేగంపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని, ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పాఠశాల యాజమాన్యం ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆమె ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సీరియస్ అయిన మహిళా కమిషన్.. డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూల్ బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి తీసుకున్న చర్యలపై సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ విషయాన్ని చెప్పనందుకు, పిల్లల గుర్తింపును బహిర్గతం చేసినందుకు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద చైర్మన్, పాఠశాల మేనేజర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఇతర పాఠశాల అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అని కమిషన్ తన నోటీసులో ప్రశ్నించింది.
* MLA సీతక్క వ్యక్తిగత సహాయకుడు మృతి
ములుగు జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కొట్టెం వెంకట్ నారాయణ (జబ్బర్) మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్న జబ్బర్ (36) శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ములుగు సమీపంలోని సాధన స్కూల్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టాడు. దీంత తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. జబ్బర్ సీతక్కకు ప్రతి విషయంలో చేదోడువాదోడుగా ఉంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడిగా ములుగు జిల్లా ప్రజలకు సుపరిచితుడు.