Business

వడ్డీ రేట్లు పెంచిన ఈ బ్యాంకులు-TNI నేటి వాణిజ్య వార్తలు

వడ్డీ రేట్లు పెంచిన ఈ బ్యాంకులు-TNI నేటి వాణిజ్య వార్తలు

* వడ్డీ రేట్లు పెంచిన ఈ బ్యాంకులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్లను ఏ మాత్రం పెంచకుండా యధాతధంగా ఉంచినప్పటికి.. రెండు బ్యాంకులు మాత్రం లోన్ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రుణ గ్రహీత కట్టాల్సిన ఈఎమ్ఐ అమాంతం పెరిగింది. ఇంతకీ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులేవీ? ఎంత శాతం వడ్డీ పెంచిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నివేదికల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండూ కూడా తమ మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచింది. పెరిగిన ఈ రేట్లు 2023 సెప్టెంబర్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. కావున ఎవరైతే ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఉంటారో వారు కట్టాల్సిన ఈఎమ్ఐలు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్..ఐసీఐసీఐ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కావున ఓవర్ నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.45 శాతం & మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.50 శాతం, 8.85 శాతంగా ఉన్నాయి. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి చేరింది.

త్వరలో దేశీయ మార్కెట్లోకి న్యూ ఐ20

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్న ‘న్యూ హ్యుండాయ్ ఐ20’ స్పోర్టీ లుక్‌తో వస్తోంది. హ్యుండాయ్ వెర్నా మాదిరిగా న్యూ హ్యుండాయ్ ఐ20 మోడల్ కారు రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్లె కలిగి ఉంటుంది. రివైజ్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, 3డీ బ్రాండ్ లోగో, కాంట్రాస్ట్ కలర్డ్ ఫ్రంట్ స్ప్లిట్టర్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి.న్యూ హ్యుండాయ్ ఐ20 కారు డ్యుయల్ టోన్ అల్లాయ్ వీలర్స్, రేర్ డిఫ్యూజర్, రేర్ బంపర్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు జత చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో న్యూ హ్యుండాయ్ ఐ20 కారు వస్తోంది. కారు లోపల స్పోర్టీ లుక్ సీట్స్, ఐ20 బ్యాడ్జింగ్ ఉంటాయి.అడాస్ షూట్ సేఫ్టీ ఫీచర్లు, లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు. ఐ20 ఫేస్ లిఫ్ట్ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ మోటార్ ఆఫర్ కూడా ఉంటుంది. స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, సీవీటీ, డీసీటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు బంగారం ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి మీద ధరను పోల్చి చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగి రూ.55,200 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.170 కు పెరిగి రూ.60,220 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,200,24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,220.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,200,24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,220

యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్రోపై భారీ డిస్కౌంట్‌

యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.మరికొన్ని రోజుల్లో యాపిల్‌ మెగా ఈవెంట్‌కు రడీ అవుతున్న తరుణంలో భారీ డిమాండ్‌ ఉన్న పాపులర్‌ యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 రాకతో ఐఫోన్ 14 ప్రో దశలవారీగా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో  iPhone 14 Pro  ఏకంగా రూ. 66,999 తగ్గింపుతో లభిస్తోంది. త్వరలోనే యాపిల్ ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు, యాపిల్‌  వాచెస్‌ లాంచ్‌ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 13 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14 ప్రో లభిస్తోంది. గత ఏడాది లాంచ్‌ అయిన  ఐఫోన్ 14 ప్రో  లాంచింగ్‌ ప్రైజ్‌ రూ. 1,29,900.ఇపుడు ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్రో ధరను రూ.66,999 తగ్గించింది. ఇందులో HDFC బ్యాంక్ క్రెడిట్ ,డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 3000 తగ్గింపును పొందవచ్చు.అలాగే స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ ఆఫర్‌ దాదాపు రూ. 50,000 ఉంటుంది.  ఫలితంగా  iPhone 14 Pro ధర  కేవలం రూ. 69,999కి దిగి వచ్చింది.ఐఫోన్ 14 ప్రో ఫీచర్లు:6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, అత్యాధునిక A16 బయోనిక్ చిప్‌,  48ఎంపీ ట్రిపుల్ కెమెరా  12 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా  ఉన్నాయి.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్.. తన ఇన్‌ఫినిక్స్ జీరో30 5జీ (Infinix Zero 30 5G) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 8029 ఎస్వోసీ చిప్‌సెట్‌తోపాటు 12 జీబీ రామ్‌తో ఇన్‌ఫినిక్స్ జీరో30 వస్తోంది. 144 రీఫ్రెష్ రేటుతోపాటు హోల్ పంచ్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇన్‌ఫినిక్స్ జీరో30 ఫోన్ ప్రీ ఆర్డర్స్ తక్షణం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.ఇన్‌ఫినిక్స్ జీరో30 5జీ (Infinix Zero 30 5G) ఫోన్ 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999, టాప్ హై ఎండ్ 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ వేరియంట్ ధర రూ.24,999 పలుకుతుంది. గోల్డెన్ అవర్, రోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది. సప్టెంబర్ 8 నుంచి ఫోన్ల డెలివరీ ప్రారంభిస్తున్నట్లు ఇన్‌ఫినిక్స్ తెలిపింది. యాక్సిస్ క్రెడిట్ కార్డు పై కొనుగోలు చేసే వారికి రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రూ.23,050 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఇన్‌ఫినిక్స్ జీరో30 5జీ (Infinix Zero 30 5G) ఫోన్.. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎక్స్ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400×1080 పిక్సె్ల్స్) 6-డిగ్రీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 144 రీఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 12 జీబీ రామ్ కెపాసిటీ ఉన్నా ఆన్ బోర్డ్ మెమరీతో 21 జీబీ రామ్ వరకూ విస్తరించవచ్చు.ఇన్‌ఫినిక్స్ జీరో30 5జీ (Infinix Zero 30 5G) ఫోన్.. క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఓఐఎస్ సపోర్ట్, 13 -మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. సెకన్‌కు 60 ఫ్రేమ్స్‌తో 4కే వీడియో రికార్డింగ్ చేయొచ్చు.  ఇన్‌ఫినిక్స్ జీరో30 5జీ (Infinix Zero 30 5G) ఫోన్.. 5జీ, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూ టూత్ 5.3, వై-ఫై 6 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్‌తోపాటు అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, జీ-సెన్సర్, గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

కేవలం ఒక్కఆగస్టులోనే 78,010 యూనిట్ల టాటా మోటార్స్ విక్రయాలు

 టాటా మోటార్స్ శుక్రవారం గత నెల మోటార్స్‌ లిమిటెడ్‌ విక్రయాల వివరాలను వెల్లడించింది. కేవలం ఒక్కఆగస్టులోనే టాటా మోటార్స్‌ వాహనాలు 78,010 యూనిట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ తెలిపింది. ఇందులో సీవీ అమ్మకాలు 32,077 యూనిట్లు, పీవీ అమ్మకాలు 45,933 యూనిట్లు ఉన్నాయి. ఇవి వరుసగా గత ఏడాదితో పోలిస్తే మూడు శాతం హైక్ ఉంది. ఎగుమతుల కన్నా.. మొత్తం దేశీయ అమ్మకాలు 76,261 యూనిట్లు కాగా, అందులో హెచ్‌సీవీ ట్రక్కులు 9 వేలు, ఐఎల్‌ఎంసీవీ ట్రక్కులు 5,207, ప్యాసింజర్‌ వెహికల్స్ 2,986, ఎస్‌సీవీ కార్గో వెహికల్స్ 13,555 యూనిట్లు అమ్ముడయ్యాయి.

టెస్లా కార్ల డిజైన్‌లను తలదన్నేలా: బీఎండబ్ల్యూ కార్‌

ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..టెస్లాకు గట్టిపోటీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లో నెంబర్‌ వన్ స్థానంలో కొనసాగుతున్న టెస్లాను తలదన్నేలా ఇప్పటి వరకు ఏ కార్లలో లేని డిజైన్లతో ప్రత్యేకమైన తొలి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ప్రోటో టైప్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా, చైనా ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో తొలిస్థానంలో ఉన్న టెస్లా, ఇతర స్థానిక ఆటోమొబైల్‌ కంపెనీలను వెనక్కి నెట్టి, వాహనదారుల్ని ఆకట్టుకునేలా ఈ కారును డిజైన్‌ చేసింది. ‘బీఎండబ్ల్యూ న్యూ క్లాస్సే’ (bmw Neue Klasse) పేరుతో విడుదల కానున్న బీఎండబ్ల్యూ కారును వచ్చే వారం జర్మనీ మ్యూనిచ్‌లో జరిగే ఇంటర్నేషన్‌ మోటార్స్‌ షో (iss) ప్రదర్శనకు పెట్టనుంది. 2025లో ఈ మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.అదే సమయంలో మెర్సిడెజ్‌ బెంజ్‌ గ్రూప్‌ సైతం న్యూ బ్యాటరీ పవర్డ్‌ మోడల్స్‌తో పాటు, వోక్స్‌వ్యాగన్ కార్‌ విడుదల కావాల్సి ఉంది. కానీ కార్లలో తలెత్తిన సాఫ్ట్‌వేర్‌ సమస్యల కారణంగా ఫోర్ష్‌, ఆడి కార్ల విడుదల కంటే ఆలస్యంగా మార్కెట్‌కు పరిచయం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దశబ్ధాల కాలంగా రెండు డోర్లతో విడుదల చేసే కూపే (cupe) తరహా కార్లకు బీఎండబ్ల్యూ స్వస్తి చెప్పింది. బదులుగా, విండ్‌స్క్రీన్ మొత్తం వెడల్పు చేసింది. దీంతో పాటు వాయిస్ కమాండ్‌లు, హ్యాండ్‌ మూమెంట్‌తో డ్రైవింగ్‌ చేసేలా డిజిటల్ డిస్‌ప్లేను డిజైన్‌ చేసింది. చైనా కంపెనీలైన బీవైడీ కో, ఎన్‌ఐఓ ఐఎన్‌సీకి పోటీగా స్థానిక వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా అదిరిపోయే ఫీచర్లతో ఈవీ కారును రూపొందిస్తుంది. బీఎండబ్ల్యూ న్యూ క్లాస్సే మోడల్‌లు 800 కిలోమీటర్ల (497 మైళ్ళు) పరిధిని కలిగి ఉంటాయి. అరగంటలో 10శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. గత సంవత్సరం, మెర్సిడెస్ నుండి ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ ఒకే ఛార్జ్‌తో 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచింది. కాగా, బీఎండబ్ల్యూ, మెర్సిడైజ్‌ బెంజ్‌, ఆడి కార్లు చైనా ప్రీమియం సెగ్మెంట్లలో ఆదిపత్యాన్ని చెలాయించాయి. కానీ అక్కడ ఈవీ కార్లకు డిమాండ్‌ పెరడగడంతో ఫ్యూయిల్‌ కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. అందుకే ఆటోమొబైల్‌ సంస్థ ఎలక్ట్రిక్‌ కార్లపై దృష్టిసారించాయి.

రిలయన్స్ కు షాక్

 గతవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థలు రూ.62,279.74 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీన్ రూ.38,495.79 కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టంతో రూ.16,32,577.99 కోట్లకు చేరుకున్నది. అయినా ఎం-క్యాప్‌లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది.  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారత్ ఎయిర్‌టెల్ భారీగా నష్టపోయాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ భారీగా లబ్ధి పొందాయి. గత నెల రెండో వారంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీగా రూ.25,011 కోట్ల ఎం-క్యాప్ కోల్పోయింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 500 పాయింట్ల లబ్ధితో ముగిసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,917 కోట్లు పెరిగి రూ.11.93 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.9,338 కోట్ల లబ్ధితో రూ.5.99 లక్షల కోట్ల వద్ద నిలిచింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.6,562 కోట్ల పురోగతితో రూ.4.43 లక్షల కోట్లకు చేరుకున్నది.రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,495 కోట్ల నష్టంతో రూ.16.33 లక్షలకోట్లకు పతనమైంది. హిందూస్థాన్ యూనీ లివర్ రూ.14,649 కోట్ల పతనంతో రూ.5.89 లక్షల కోట్లకు.. భారతీ ఎయిర్‌టెల్ రూ.4,194 కోట్లు కోల్పోయి రూ.4.84 లక్షల కోట్లకు, ఐటీసీ రూ.3,037 కోట్ల నష్టంతో రూ.5.50 లక్షల కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.898 కోట్ల పతనంతో రూ.6.78 లక్షల కోట్లకు టీసీఎస్ రూ.512 కోట్ల నష్టంతో 12.36 లక్షల కోట్లకు చేరుకున్నది.గత శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ16.33 లక్షల కోట్ల వద్ద నిలిచింది. టీసీఎస్ రూ.12.36 లక్షల కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11.93 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.6.78 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ రూ.5.99 లక్షల కోట్లు, హెచ్‌యూఎల్ రూ.5.89 లక్షల కోట్లు, ఐటీసీ రూ.5.50 లక్షల కోట్లు, భారతీ ఎయిర్ టెల్ రూ.4.84 లక్షల కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.4.43 లక్షల కోట్ల వద్ద నిలిచాయి.

మళ్లీ తగ్గిన రష్యా చమురు దిగుమతులు

చౌకైన రష్యా చమురు దిగుమతులు వరుసగా మూడో నెల క్షీణించాయి. ఆగష్టు నెలకు సంబంధించి రష్యా నుంచి భారత చమురు దిగుమతులు ఏడు నెలల కనిష్ఠానికి తగ్గి 14.6 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి. అంతకు ముందు జూలైలో 19.1 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి జరిగింది. దేశీయంగా వర్షాకాలం కావడంతో డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గతేడాది రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా రష్యా తక్కువ ధరకు చమురును విక్రయించడం ప్రారంభించింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం రష్యా నుంచి చౌక చమురును కొనుగోలు చేసింది.2022, ఫిబ్రవరి ముందు వరకు భారత్ చమురు దిగుమతుల్లో 1 శాతం వాటా ఉన్న రష్యా, ఆ తర్వాత గణనీయంగా పెరిగింది. దాదాపు సగం దిగుమతులు రష్యా నుంచే వచ్చే స్థాయికి చేరింది. ఇటీవల దేశీయ డిమాండ్ తగ్గడం, చమురు సంస్థల మెయింటెనెన్స్ కారణంగా దిగుమతులు తగ్గాయి. మరోవైపు రష్యాతో పాటు ఇరాక్ నుంచి కూడా భారత చమురు కంపెనీలు దిగుమతులను తగ్గించాయి. జూలైలో 8.91 లక్షల బ్యారెళ్ల నుంచి ఆగష్టులో 8.66 లక్షల బ్యారెళ్లకు క్షీణించాయి. ఇదే సమయంలో సౌదీ అరేబియా నుంచి చమురు దిగుమతి 4.84 లక్షల బ్యారెళ్ల నుంచి 8.20 లక్షల బ్యారెళ్లకు పెరగడం గమనార్హం.