DailyDose

మట్టికింద అక్రమంగా దాచిన 106 బంగారు బిస్కెట్లను స్వాధీనం

మట్టికింద అక్రమంగా దాచిన 106 బంగారు బిస్కెట్లను స్వాధీనం

పశ్చిమబెంగాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. భారత్‌ – బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ గ్రామం సమీపంలో సరిహద్దు భద్రతా దళం(BSF), డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో సెప్టెంబర్‌ 2న సోదాలు చేయగా.. ఓ గుంత తవ్వి మట్టికింద అక్రమంగా దాచి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు, ముక్కలను సీజ్‌ చేశారు. బంగారం బిస్కెట్ల బరువు దాదాపు 14.3 కిలోలు ఉండగా.. దీని ధర రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా. బంగారం అక్రమ తరలింపులో వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటు అతడికి సహాయకుడిగా ఉన్న మరొకరిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు.