Politics

దానికి కూడా జగన్ పన్ను వేస్తాడని లోకేష్ సెటైర్

దానికి కూడా జగన్ పన్ను వేస్తాడని లోకేష్ సెటైర్

 సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరంలో ఆయన మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రను ఆపే మగాడు ఇంకా పుట్టలేదు.. ఇక పుట్టబోడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. సైకో జగన్ సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎద్దేవా చేశాడు. అధికారం కోసం దళితుడి జీవితాన్ని సైకో జగన్ చీకటి చేశాడని.. ఇప్పటికి కోడికత్తి శ్రీనివాస్‌కు బెయిల్ రాలేదని అన్నారు.రాష్ట్రంలో అంధకార ప్రదేశ్ అనే కొత్త పథకానికి తెరతీశాడని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరెంట్ సరిగ్గా ఉండకున్నా.. ఛార్జీలు మోగిపోతున్నాయని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో దరిద్రం తాండవిస్తోందని ధ్వజమెత్తారు. గాలి పీల్చుతున్నామని.. దానికి కూడా జగన్ పన్ను వేస్తాడని సెటైర్ వేశాడు. జగన్ దరిద్ర పాలనకు వరుణ దేవుడు కూడా బైబై ఏపీ అన్నాడని విమర్శించారు. బాంబులకే భయపడలేదు.. వైసీపీ ఫ్లెక్సీలకు భయపడతామా అని ఫైర్ అయ్యారు.