NRI-NRT

గల్ఫ్‌లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

గల్ఫ్‌లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

గల్ఫ్‌సేన జనసేన యూఏఈ (Janasena UAE) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకలు అజమాన్ మైత్రి ఫామ్స్ నందు జనసేన పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా, ఆట పాటలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటులు జనసేన నాయకులు పృథ్వి రాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూఏఈలో ఉన్న జన సైనికులు భారీ సంఖ్యలో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా నా సేన నా వంతుగా కోటి రూపాయలు విరాళంలో భాగస్వాములకు ప్రత్యేక ఆహ్వానంతో కృతజ్ఞతలు తెలియజేశారు.

గల్ఫ్‌సేన జనసేన యూఏఈ ఎక్సిక్యూటివ్ టీమ్‌ను 50 మందితో వివిధ కమిటీలు (ఫైనాన్స్, సోషల్ మీడియా, ఈవెంట్స్ అండ్ లాజిస్టిక్, అడ్మిన్, వేల్ఫేర్ కమ్యూనిటీ, అడ్వైసరీ, ఎన్నారై మహిళా విభాగం) లను పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అనుమతితో ఆరు గల్ఫ్‌దేశాల పార్టీ కార్యక్రమంలో ముఖ్యపాత్ర పోషించుచున్నకేసరి త్రిమూర్తులు ఈ సభాముఖంగా ప్రకటించారు ఇటువంటి కమిటీలు త్వరలోనే పార్టీ ఆదేశాలతో మిగిలిని గల్ఫ్ దేశాలలో కూడా ఏర్పాటు చేస్తామని త్రిమూర్తులు తెలియ చేశారు.

ఈ కమిటీ సభ్యులతో పృథ్వీ పార్టీ బలోపేతం కోసం ప్రమాణ స్వీకారం చేయించారు. పృథ్వి రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్య మంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించాలని గల్ఫ్ ఎన్నారైలను కోరారు. గల్ఫ్ జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించి గల్ఫ్ జనసైనికుల పాత్ర జనసేన బలోపేతంలో మరువలేనిదని ‘నా సేన కోసం నా వంతు కోటి రూపాయలు’ పార్టీ కోసం గల్ఫ్ దేశాల నుంచి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని ఆయన జనసైనికులను కొనియాడారు. ఇంకా మున్ముందు పార్టీ కోసం గల్ఫ్ జనసైనికుల ముఖ్య పాత్ర పోషించి పార్టీ గెలుపు కోసం పని చేయాలని ఆయన గల్ఫ్ జనసేన కార్యకర్తలును కోరారు.

అలాగే ‘నా సేన కోసం నా వంతు’లో భాగమైన ప్రతి జనసైనికుడిని పృథ్వి రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ప్రసంగాలతో వారి అభిప్రాయాలను తెలియజేశారు. పార్టీ విజయానికి చేయవలసిన సూచనలు కార్యాచరణను వివరించారు. అనంతరం కార్యనిర్వాహక సభ్యుల ఆధ్వర్యంలో పృథ్వి రాజ్ ఘనంగా సన్మానించారు. తదుపరి కార్యక్రమం కేకే కటింగ్‌తో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు గల్ఫ్‌సేన జనసేన ద్వారా శుభాకాంక్షలు తెలియపరిచారు.