Food

కూరలో కనుక ఉప్పు ఎక్కువైందంటే ఇలా ఉప్పును తగ్గించవచ్చు

కూరలో కనుక ఉప్పు ఎక్కువైందంటే ఇలా ఉప్పును తగ్గించవచ్చు

ఒక్కొక్కసారి కూరల్లో మనకి తెలియకుండానే ఉప్పు ఎక్కువ వేసేస్తూ ఉంటాము. ఉప్పు కనుక కూరలో ఎక్కువైందంటే ఇక ఆ వంట తినలేము ఎంత కష్టపడి తినాలని ప్రయత్నించినా కూడా ఉప్పు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఉప్పు తగ్గితే కొంచెం తినేటప్పుడు వేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే మాత్రం కష్టమే ఒక్కోసారి ఏదో ఆలోచిస్తూ రెండుసార్లు ఉప్పు వేసేయడం లేదంటే పొరపాటుగా పెద్ద చెంచా తో ఉప్పు వేసేయడం చేస్తూ ఉంటాము.

దాని వలన ఉప్పు ఎక్కువైపోతుంది అప్పుడు తినలేము కూడా. కూరలో కనుక ఉప్పు ఎక్కువైందంటే ఇలా ఉప్పును తగ్గించవచ్చు కూరలో ఉప్పు ఎక్కువైతే కూరని పారేయకండి కూరలో ఉప్పు తగ్గించాలంటే ఉడికించిన బంగాళదుంపని కూరలో వేసేయండి ఆ బంగాళదుంప ఉప్పుని పీల్చుకుంటుంది ఉప్పు తగ్గుతుంది. కూరలో ఉప్పు కనక ఎక్కువయినట్లైతే కొంచెం పెరుగు కలపండి.

పెరుగు కలిపితే రుచి బాగుంటుంది ఉప్పు కూడా బాగా తగ్గుతుంది ఉప్పు ఫ్లేవర్ ని తగ్గించుకుంటే కూరని తినొచ్చు. టమాటా ఉల్లిపాయ ముద్ద వేసి కూడా మీరు ఉప్పు తగ్గించుకోవచ్చు. కూరలో ఉప్పు తగ్గాలంటే ఇలా టమాటా ఉల్లిపాయ ముద్దని వేయండి అప్పుడు ఉప్పు తగ్గుతుంది. ఇలా ఈ పద్ధతులతో సులభంగా కూరలో ఉప్పును తగ్గించుకోవచ్చు. ఉప్పు తగ్గితే తినడానికి బానే ఉంటుంది. ఉప్పు బాగా ఎక్కువైందంటే తినడం కష్టం కాబట్టి పారేయకుండానే మీరు ఇలా సులభంగా ఉప్పును తగ్గించుకోవచ్చు.