DailyDose

భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ-TNI నేటి తాజా వార్తలు

భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ-TNI నేటి తాజా వార్తలు

శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయానికి రెండు ఎద్దుల విరాళం

తిరుమల జిల్లా శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయానికి రెండు ఎద్దులు విరాళంగా వచ్చాయి. విజయవాడకు చెందిన సుధాకర్‌ చౌదరి అనే భక్తుడు రెండు ఎద్దులను విరాళంగా అందజేశారు. రెండు ఎద్దులను ఆలయ ఛైర్మన్‌ శ్రీనివాసులుకు అందజేశారు. రెండు ఎద్దులను అందజేసిన దాతలకు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.

భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

హైద‌రాబాద్ – ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్క‌ర్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ ముంద‌స్తు పిటిష‌న్ తెలంగాణ హైకోర్టులో దాఖ‌లు చేశారు. ఈ బెయిల్ పిటిష‌న్ పై కోర్టు విచారించింది. ఇదిలా ఉండ‌గా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాయ‌న‌, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి స్వ‌యాన త‌మ్ముడైన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా చంపారు.ఈ దారుణ హ‌త్య కేసులో కీల‌క‌మైన నిందితులుగా ఉన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఈ కేసును సీరియ‌స్ గా తీసుకున్నాయి. ఇప్ప‌టికే భాస్క‌ర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ప్ర‌స్తుతం ఆయ‌న చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు.త‌న‌కు ఆరోగ్యం బాగో లేద‌ని, వెంట‌నే చికిత్స నిమిత్తం బ‌య‌ట‌కు పంపించాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు భాస్క‌ర్ రెడ్డి. ప్ర‌స్తుతం ఆయ‌న చంచ‌ల్ గూడ చెర‌సాల‌లో ఉన్నారు. బెయిల్ పిటిష‌న్ ను పూర్తిగా కొట్టి వేస్తున్న‌ట్లు తెలంగాణ హైకోర్టు ప్ర‌క‌టించింది.కాగా త‌మ‌ను కావాల‌ని ఇరికించారంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. త‌న‌కు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య‌తో ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మొత్తం హ‌త్య వ్య‌వ‌హారం ఇరు తెలుగు రాష్ట్రాల‌లో క‌ల‌క‌లం రేపింది.

*  హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

 ఈనెల 16, 17వ తేదీన హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించిందని, 17న CWC సభ్యులతో పాటు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశం నిర్వహిస్తామన్నారు. 17న సాయంత్రం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సమావేశన్ని ఏర్పాటు చేయనున్నదని స్పష్టం చేశారు.ఈ సమావేశంలోనే జాతీయ కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేయబోయే 5 గ్యారంటీల(హామీలు) ప్రకటించనున్నదని వెల్లడించారు. ఇక సెప్టెంబరు 18 నుండి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ 5 గ్యారంటీలతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌లతో ఇంటింటి ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ 

బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనని తెలంగాణ బిజెపి రాష్ట్ర పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన మీద వేటు వేసినట్లు తెలుస్తోంది. యెన్నం శ్రీనివాసరెడ్డి 2002లో టీఆర్ఎస్ పార్టీలో తన రాజకీయప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 2009లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అక్కడినుంచి 2012లో బీజేపీలో చేరారు. ఆ యేడు మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీం మీద 1859 ఓట్ల మెజారిటీతో గెలిచారు.2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి వి శ్రీనివాస్ గౌడ్ చేతిలో 2535 ఓట్ల తేడాతో  ఓడిపోయారు. ఆ తర్వాత 2017 నవంబర్ 23న బిజెపికి రాజీనామా చేశారు.2016లో చెరుకు సుధాకర్తో కలిసి యెన్నం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమ వేదికను స్థాపించారు. 2017 లో ఏర్పాటు అయిన తెలంగాణ ఇంటి పార్టీలో పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు.  2019లో తిరిగి బిజెపిలో చేరారు.

హైదరాబాద్ లో ఆగని వర్షం

రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని  పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్, మెదక్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. రాజధానిలో ఆకాశం మేఘావృతమై ఉన్నది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌,మెహదీపట్నం, నాంపల్లిలో భారీ వర్షాలు పడుతున్నాయి.భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.రోడ్లపై ట్రాఫిక్  కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో రెండు, మూడు రోజులు తెలంగాణ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో రెండు, రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుండటంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

*  బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై కేటీఆర్ ఫైర్ 

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. దేశంలో బీజేపీ పాలిత డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు, కాంగ్రెస్, సంకీర్ణ రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఉందన్నారు. తెలంగాణ మాత్రం విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉందన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశానికి ఉత్తమ అభివృద్ధి నమునాగా నిలుస్తుందన్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను నేను అలా అనలేదు: రోజా

రజనీకాంత్ వాఖ్యలపై తాను విమర్శలు చేయలేదు.. ఖండించాను అని వివరణ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. రజనీకాంత్ ఎవరినో ఉద్దేశించి చేసిన వాఖ్యలను మాకు అపాదిస్తూ సోషయల్ మీడియాలో ట్రోల్ చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ఇక, లోకేష్ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో మోరుగుతున్నాడు.. పవన్ కల్యాణ్‌ షూటింగ్ గ్యాప్ లో చంద్రబాబు ఫ్యాకేజిని తీసుకోని విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదు అని నిలదీశారు. మరోవైపు.. అమరావతిలో అక్రమాలకు పాల్పడిన డబ్బులను బ్రహ్మిణి, భువనేశ్వరి లెక్కల్లో పెట్టారు.. చంద్రబాబు, లోకేష్ ని విచారించి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. టీడీపీ కొత్త పాలకమండలిపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. కేసులు పెట్టగానే నేరచరిత్రులు కారు.. వారిని పాలకమండలిలో నియమిస్తే టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా.

*  చంద్రబాబు రాజకీయం మొత్తం చీకటి చరిత్ర

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి అమర్నాథ్ సోమవారం విశాఖలో మీడియాతో మాట్లడుతూ.. చంద్రబాబుకు ఐటీ షోకాజ్‌ నోటీసులపై రెండు రోజులు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు సమాధానం ఇవ్వడం లేదని చెప్పారు. పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టం అవుతుందని అన్నారు. చంద్రబాబు నీతులు చెబుతుంటారని.. మరి ఆయనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి కదా అని మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం చీకటి చరిత్ర అని ఆరోపించారు. చంద్రబాబు  రాజకీయం అంతా కుట్రలు, కుతంత్రాలేనని విమర్శించారు. చంద్రబాబు ఎదుగుదల, ఆస్తుల గురించి ప్రజలకు తెలుసునని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు ద్వారానే  రాజకీయంగా ఎదిగారని విమర్శించారు. చంద్రబాబుపై ఉన్న కుంభ కోణాలు.. దేశంలో ఏ రాజకీయ నాయకుడిపైన లేవని ఆరోపించారు. ఏలేరుస్టాంపుల కుంభకోణంలో చంద్రబాబు ప్రయేయం తెలియంది కాదని  అన్నారు. ఐటీ నోటీసులు ఇస్తే చంద్రబాబు తేలు కుట్టిన దొంగల ఉన్నారని విమర్శించారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. అన్నాహజారే వారసుడినంటూ చెప్పుకునే చంద్రబాబు.. ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. రూ. 118 కోట్ల లంచాలు తీసుకున్నారని ఐటీ చెబుతుంటే.. సంబంధం లేని లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తీగ బయటకు వచ్చింది.. ఇంకా డొంక కదలాల్సి ఉందన్నారు. 2020 నుంచి నాలుగు  నోటీసులు ఇచ్చారని.. సంబంధం లేదని చంద్రబాబు వివరణ ఇచ్చారని.. ఆయన వారి జురిడిక్షన్‌లో లేరని అంటారని సెటైర్లు వేశారు. అమరావతిలో దొంగతనం చేస్తే కనకదుర్గ వారధి దగ్గర ఎందుకు పట్టుకున్నారని పోలీసులను ప్రశ్నించినట్టుగా చంద్రబాబు తీరు ఉందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎంవీపీ అనే వ్యక్తి కంపెనీ నుంచి అవినీతి సొమ్ముకు మీడియేటర్‌గా పనిచేసినట్టుగా తేలిందని అన్నారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని విమర్శించారు. అమరావతి పేరుతో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

కేసీఆర్‌ పై చిన్న జీయర్ స్వామి ప్రశంసలు

కేసీఆర్‌ సర్కార్‌ పై త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రశంసలు కురిపించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వ‌ల్మిడి లో శ్రీ సీతారామచంద్రస్వాముల ఆలయాన్ని ప్రారంభించి విగ్రహాల పునఃప్రతిష్ఠ చేశారు త్రిదండి చిన్న జీయర్ స్వామి. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. ఆనందాన్ని ఇచ్చేది సంపద… కొత్త ఆలయాలు నిర్మించడం సమాజమన్నారు. కానీ పురాతన ఆలయాన్ని పునఃర్జీవం పోయడం గొప్ప విషయం అంటూ కేసీఆర్‌ సర్కార్‌ ను పొగిడారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడి లో రామాలయం నిర్మించడం మహాఅభినందనీయం అన్నారు. దేవుడు గుడి వద్ద అందరు సమానమేనని.. చిన్నా పెద్దా కుల మత భేదం దేవుడి వద్ద ఉండదని చెప్పారు. మానవీయ కోణంతో చేసేపాటు కార్యాలన్ని సత్ఫలితాలు ఇస్తాయన్నారు. అతి ప్రాచీనమైన వాల్మికి తో సంబందం ఉన్న ఆలయం వల్మిడి రామాలయం అంటూ పేర్కొన్నారు త్రిదండి చిన్న జీయర్ స్వామి.

బీజేపీపై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఫైర్

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా విపక్షాలు అన్ని వ్యూహాల‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే  తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన పోడ్‌కాస్ట్ ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ మొదటి ఎపిసోడ్ లో పలు అంశాలను ప్ర‌స్తావిస్తూ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. అనేక హామీలను బీజేపీ పూర్తి చేయలేకపోయిందనీ, భారతదేశ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ నరేంద్ర మోడీ మోడల్ అంతం కాబోతోందని ఆయన పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ నెరవేర్చలేకపోయిందని స్టాలిన్ అన్నారు. భారతదేశం కోసం మాట్లాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, భారతీయులు ఇంతకాలం అభిమానించిన ఐక్యతా భావాన్ని నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. తాను ప్ర‌జ‌ల్లో ఒకరైన వ్యక్తిగా భారతదేశం కోసం మాట్లాడాలనుకుంటున్నాన‌నీ, మనమందరం భారతదేశం కోసం మాట్లాడాల్సిన సమయంలో ఉన్నామ‌ని చెప్పారు. బీజేపీ భారతదేశ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందనీ, భారతీయులు ఇంతకాలం ఆదరించిన, పరిరక్షించిన ఐక్యతా భావాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాల విషయంలో నెరవేర్చడంలో విఫలమైందన్నారు.