Business

భువనేశ్వర్‌ నుంచి దిల్లీ వెళుతున్న విమానాన్ని ఢీకొన్న పక్షి

భువనేశ్వర్‌ నుంచి దిల్లీ వెళుతున్న విమానాన్ని ఢీకొన్న పక్షి

ఇండిగో (IndiGo) సంస్థకు చెందిన ఒక విమానాన్ని టేకాఫ్‌ అయిన కాసేపటికే పక్షి (Bird) ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన భువనేశ్వర్‌ నుంచి దిల్లీ వెళుతున్న విమానంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..

ఇండిగో సంస్థకు చెందిన 6E2065 విమానం 180 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌ నుంచి దిల్లీకి బయలుదేరింది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకు ఒక పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం ఎడమ రెక్కలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్‌ గుర్తించారు. విమానాన్ని అత్యవసరంగా భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ( BPIA) మళ్లించారు. సురక్షితంగా విమానాన్ని ల్యాండ్‌ చేశారు. దీంతో ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకోవడంతో అత్యవసరంగా ల్యాండ్‌ చేసిన విషయం తెలిసిందే.