దసరా శరన్నవరాత్రి వేడుకలకు ఇంద్రకీలాద్రి సిద్ధం అవుతుంది. అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రులు చెయ్యటానికి ఇప్పటికే వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పటికే ఆలయ అధికారులు ఏర్పాట్లపై నిమగ్నం అయ్యారు.
అక్టోబర్ 15 నా నుండి ప్రారంభం కానున్న ఈ దేవి నవరాత్రుల్లో 9 రోజుల్లో 9 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తారు. మొదటి రోజు స్నాపనభిషేకం ప్రత్యక అలంకారం ,పూజ కార్యక్రమం అనంతరం బాలాత్రిపుర సుందరి దేవిగా ,16 న గాయత్రీ దేవిగా ,17 న అన్నపూర్ణ దేవిగా ,18 న మహాలక్ష్మి దేవిగా ,19 న లలితా త్రిపుర సుందరి దేవిగా ,20 న సరస్వతి దేవిగా ,21 న దుర్గ దేవిగా ,22 న మహిషాశుర మర్దినిగా ,23 న రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తుంది. ఒక్క మొదటి రోజు మాత్రం అమ్మగారి స్నాపనభిషేకం అనంతరం ఉదయం 9 గంటల తర్వాత అమ్మవారి దర్శనాలు ప్రారంభం అవుతాయి. రాత్రి 10 గంటల వరకు దుర్గమ్మను దర్శించుకోవచ్చు.
మిగతా రోజుల్లో తెల్లవారు జామున 4 గంటల నుండే దర్శనాలు ప్రారంభం అవుతాయి. భక్తుల రద్దీ దృశ్యా మూలా నక్షత్రం రోజు 20 వ తేదీన తెల్లవారు జామున 2 గంటల రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. 23 వ తేదీ విజయదశమి రోజు 10:30 కు పూర్ణాహుతితో దేవి నవరాత్రులు ముగుస్తాయి. సాయంత్రం దుర్గ మలేశ్వర స్వామి వార్లు హంస వాహనంపై కృష్ణ నదిలో తెప్పొత్సగంపై నది విహారం చేస్తారు. నవరాత్రులకు ఇప్పటికే 4 కోట్లతో తాత్కాలిక టెండర్స్ కు పిలుపునిచ్చారు ఆలయ అధికారులు లైటింగ్ ,ఎలెక్ట్రికల్ నుండి క్యూ లైన్స్ ,ఘాట్ స్నానాలు వద్ద ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. దురా ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చెయ్యనున్నారు.