Politics

నేడు అనంతపురంలో చంద్రబాబు పర్యటన

నేడు అనంతపురంలో చంద్రబాబు పర్యటన

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఉదయం 11.05 గంటలకు విమానంలో బయలుదేరి, 12.15 గంటలకు బళ్లారి జిల్లా తొరణగల్‌లోని జిందాల్‌ విజయనగర విమానాశ్రయానికి చేరుకుంటారు. బళ్లారిలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో మధ్యాహ్నం 2.30 గంటల వరకు చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం పల్లేపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత అక్కడే వేరుశనగ రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు రాయదుర్గం పట్టణానికి చేరుకుని, ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ రాత్రికి రాయదుర్గం రాయల్‌ పీజీ కాలేజీలో బస చేస్తారు. 6న కళ్యాణదుర్గం, 7న గుంతకల్లు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. 7న అనంతపురం జిల్లాలో పర్యటన ముగించుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాకు వెళతారు.