తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త అనే చెప్పాలి. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకృకటించింది ఆర్టీసీ. ఇక ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇవాళ ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్టీసీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్టీసీని ప్రయివేటు పరం చేస్తారనే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసి వేతనాలు పెంచేశారు. అందరూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది ప్రభుత్వం. పెళ్లిల సమయంలో ఎం.డీ. సజ్జనార్ ప్రత్యేఖ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకున్న వారికి ప్రత్యేకంగా బహుమతి కూడా అందిస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అటు ఆర్టీసీ చైర్మన్, ఇటు ఎం.డీ. తెలంగాణ ప్రజల అవసరాల దృష్ట్యా అన్నింటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.