చీమలు కుడితే వాపు, దురద, మంట రావడం జరుగుతుంది.. చలి చీమలు కూడా చాలా నొప్పి ఉంటుంది.. అయితే చీమలు కూడా ప్రాణాలు పోతాయని చాలా మందికి తెలియదు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చీమలు కుడితే ప్రాణాలు క్షణాల్లోనే పోతుందని నిపుణులు చెబుతున్నారు.. ఏంటి నిజమా.. అనే సందేహం కలగడం కామన్.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.. అలాంటి చీమలు కూడా కొన్ని ఉన్నాయి.. ఆ చీమల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భూప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన చీమ శాస్త్రీయ నామం ‘బుల్ డాగ్ యాంట్’ అంటారు. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో కనిపిస్తుంది.. 1936 నుండి ఈ చీమ కాటు కారణంగా చాలా మంది మరణించారు. ఈ చీమ 20 మిమీ పొడవు ఉంటుంది. ఈ చీమ దాడి చేయడాని కి దాని స్టింగర్, దవడలను ఉపయోగిస్తుంది.ఈ చీమ కొరికిన కొన్ని నిమిషాల్లో దాని విషం మనిషి ప్రాణాలను తీస్తుంది.. ఈ చీమల వల్ల 1988 వరకు చనిపోయారు.. అదే చివరి మరణం కూడా..
ఈ చీమల శరీర పొడవు 20 మిమీ, బరువు 0.015 గ్రాములు. దీని జీవితకాలం 21 రోజులు మాత్రమే. ఈ ప్రమాదకరమైన చీమలు 1793లో కనుగొనబడ్డాయి.. వాటి గూళ్ళు ఎక్కువగా మట్టిలో కనిపిస్తాయి, కానీ అవి కుళ్ళిన చెక్క, రాళ్ల అడుగున కూడా కనిపిస్తాయి. ఈ జాతి చీమలు భూమిలో నివాసం ఉండలేవు.. కొన్ని తెగల వాళ్లు పెళ్లిళ్లు కావాలంటే వీటితో కుట్టించుకోవాలనే ఆచారం కూడా ఆ దేశాల్లో ఉంది.. ఇలాంటి ఆచారాలు మన దేశం లో లేవు.. లేకుంటే సగం మందికి పై బ్రహ్మచారులుగా ఉండేవారు..