రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఖమ్మం నగరానికి మరోసారి నిధుల వరద పారించారు. ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూ.100 కోట్ల నిధులు విడుదల చేశారు. నిధుల విడుదలకు సంబంధించిన జీవో కాపీని శుక్రవారం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజల తరఫున మంత్రి కేటీఆర్‌కు.. అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పువ్వాడ విజ్ఞప్తి మేరకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TUFIDC) ద్వారా ఈ నిధులు విడుదల చేశారు.