Politics

కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన తమిళి సై

కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన తమిళి సై

సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళి సై ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ సీనియర్ నాయకుడని, పవర్ ఫుల్ నేత అని ఆమె కొనియాడారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తను చూస్తున్నారని వివరించారు. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్‌ లేదన్నారు. తాను రాజకీయాలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం కనీసం పెట్టుకునే ఉద్దేశం లేదని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. సీఎంతో ఎలాంటి దూరం లేదని, తన దారి తనదేనని కామెంట్స్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని అన్నారు. మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి కేంద్రం అడిగిన సమయంలో రాష్ట్రం స్పందించలేదనే విషయాన్ని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.