NRI-NRT

పేద విద్యార్థులకు న్యూజెర్సీ సాయిదత్తపీఠం తోడ్పాటు

పేద విద్యార్థులకు న్యూజెర్సీ సాయిదత్తపీఠం తోడ్పాటు

న్యూజెర్సీ సాయి దత్త పీఠం, శ్రీ శివ-విష్ణు టెంపుల్ ఆధ్వర్యంలో బ్యాక్ టూ స్కూల్ డ్రైవ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పేద పిల్లలకు స్కూలు బ్యాగులు, పుస్తకాలు, పెన్సిళ్లు ఉచితంగా అందించినట్లు సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి తెలిపారు. సాయి దత్త పీఠం డైరెక్టర్ శుభ పాటిబండ్ల, శ్రీధర్ గార్గ్, దిశా గార్గ్ విజయవంతానికి తోడ్పడ్డారు. పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఎమిరేటస్ ఉపేంద్ర చివుకుల, సెనెటర్ కార్యాలయం నుండి గ్రేగ్, ప్రిన్సిపల్ సిండీ టుఫారో తదితరులు పాల్గొని కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.