Politics

అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే: కిషన్‌రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే: కిషన్‌రెడ్డి

భాజపా శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ప్రకాశ్‌ జావడేకర్‌, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జిల సమావేశంలో స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగవని తేల్చి చెప్పారు. భారాస, భాజపా ఎప్పటికీ ఒక్కటి కావని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జమిలి ఎన్నికల ఊహాగానాలతో నిమిత్తం లేకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు