ScienceAndTech

మరో ప్రయోగానికి రెడీ అవుతున్న ఇస్రో

మరో ప్రయోగానికి రెడీ అవుతున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్ యాన్ వన్ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయాన్ అంతకు మించిన ఎఫర్ట్ తో ఇస్రో చేస్తున్న ప్రయోగం గగన్ యాన్. భారత్ చేస్తున్న తొలి మ్యాన్ మిషన్ కావడంతో ఇస్రో ఏమాత్రం అశ్రద్ధ చూపడం లేదు. అసలు ప్రయోగానికి ముందుగా జరిగే ప్రయోగాత్మక ప్రయోగాలను ఒకటికి రెండు సార్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖపట్నం, గుజరాత్, తమిళనాడులో కీలకమైన ప్రయోగాలను గగన్…

వరుస విజయాలతో ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న ఇస్రో మరో భారీ ప్రాజెక్టును వేగవంతం చేసింది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయన్.. నెక్ట్స్ గగన్ యాన్.. భారత్ చేస్తున్న తొలిమ్యాన్ మిషన్ పనులను స్పీడప్ చేసింది ఇస్రో.. అందుకు సంబంధించిన కీలక ప్రయోగం త్వరలో జరపనుంది. ఇంతకీ భారత్ చేపడుతున్న మ్యాన్ మిషన్ ఎక్కడ నుంచి జరుగుతుందో తెలుసా.. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్ యాన్ వన్ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయాన్ అంతకు మించిన ఎఫర్ట్ తో ఇస్రో చేస్తున్న ప్రయోగం గగన్ యాన్. భారత్ చేస్తున్న తొలి మ్యాన్ మిషన్ కావడంతో ఇస్రో ఏమాత్రం అశ్రద్ధ చూపడం లేదు. అసలు ప్రయోగానికి ముందుగా జరిగే ప్రయోగాత్మక ప్రయోగాలను ఒకటికి రెండు సార్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖపట్నం, గుజరాత్, తమిళనాడులో కీలకమైన ప్రయోగాలను గగన్ యాన్ కోసం ముందస్తు పరీక్షలను చేపట్టారు.

బెంగళూరు నుంచి గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూ మాడ్యూల్‌ను శ్రీహరికోటకు తరలిస్తున్నారు. అయితే ఏడాదిలో రోదసిలోకి వ్యోమగాములను పంపించి తిరిగి సురక్షితంగా భూమి పైకి తెచ్చే గగన్ యాన్1 మ్యాన్ మిషన్ ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తుంది. అందులో భాగంగానే అక్టోబర్ మూడవ వారంలో గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్‌గా పిలచే.. ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇస్రో ఈ గగన్ యాన్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు రకాల పరీక్షలు విజయవంతంగా నిర్వహించి తమ సామర్థ్యాన్ని నిరూపించారు. ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించి ఇప్పుడు గగన్ యాన్ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ప్రయోగాత్మక ప్రయోగంగా జరిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.

LVM..3 ద్వారా ఇటీవల భారీ బరువున్న ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది ఇస్రో. అయితే LVM3 ని మరింత అప్డేట్ తో H.LVM 3 అంటే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మాడ్యూల్ అన్నమాట. ఈ రాకెట్ ద్వారా 8200 కేజీలు బరువు కలిగిన CREW మాడ్యూల్ 3.25 వెడల్పుగా, 3.58 పొడవైన క్రూ మాడ్యూల్‌ను ఇందులో అమర్చి గగన్ యాన్ 1 పేరుతో షార్‌లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి అక్టోబర్ మూడవ వారంలో ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్రో ఏర్పాట్లలో ఉంది. ఈ క్రూ మాడ్యూల్‌ను లో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టి అక్కడ ఏడు రోజులు తరువాత తిరిగి భూమి మీదకు సురక్షితంగా దింపేలా ప్లాన్ చేశారు. అయితే ఇలా రెండు పర్యాయాలు గగన్ యాన్ ట్రైల్ లాంచ్ ప్రయోగాలు ప్రయోగాత్మకంగా చేపట్టిన తర్వాత గగన్ యాన్ రాకెట్ ప్రయోగంలో మానవ సహిత మాన్ మిషన్ ప్రయోగం చేపట్టనుంది.

వ్యోమగాములను రోదసీ నుంచి తిరిగి భూమి మీదకు సురక్షితంగా తీసుకురావడమే ఇస్రో చేపట్టే ఈ ప్రయో ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన టెస్ట్ వెహికల్ ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి క్రూ ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుళ్లను శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని హార్డ్‌వేర్‌ వ్వస్థలు ఇప్పటికే శ్రీహరి కోటకు చేరుకున్నాయి. ప్రస్తుతం అనుసంధాన పనులు షార్‌లో జరుగుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. మిషన్ విఫలమయ్యే పరిస్థితి తలెత్తినప్పుడు మాడ్యుల్ నుంచి వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతికతను ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు. ఇందులో హ్యూమనాయిడ్ వ్యోమమిత్ర అనే రోబోను ఉంచి పరీక్షించనున్నారు.

గగన్‌యాన్ మిషన్‌లో అత్యంత కీలకంగా భావించే ప్రొపల్షన్ సిస్టమ్ పనితీరును మెరుగు పరిచేందుకు ఇటీవల చేపట్టిన పరీక్ష సక్సెస్ అయింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించగా సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (SMPS) పనితీరును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. అలాగే విశాఖ, గుజరాత్ లో కూడా కొన్ని పరీక్షలను సక్సెస్ చేసింది ఇస్రో. ఇస్రో చేపడుతున్న ఈ మ్యాన్ మిషన్ శ్రీహరికోట నుంచే జరుగుతుండగా స్థానికుల్లో ఉత్సుహకత ఎక్కువగా ఉంది.