Sports

యూఎస్ ఓపెన్ లో ప్రపంచ నంబర్ వన్ కు చుక్కఎదురు

యూఎస్ ఓపెన్ లో ప్రపంచ నంబర్ వన్ కు చుక్కఎదురు

యూఎస్ ఓపెన్ 2023 లో భాగంగా పురుషుల సింగిల్స్ లో ఈ రోజు ఉదయం జరిగిన మొదటి సెమీఫైనల్ లో వరల్డ్ నెంబర్ 1 కు భారీ షాక్ తగిలింది. స్పెయిన్ కు చెందిన కార్లస్ అలకరాజ్ గత యూఎస్ ఓపెన్ లో విజేతగా నిలవడంతో పాటుగా, టెన్నిస్ లో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా మారాడు. జొకోవిచ్, డేనియల్ , నాదల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను సైతం వెనక్కు నెట్టి పురుషుల సింగిల్స్ లో నెంబర్ వన్ గా ఉన్నాడు. తాజాగా కార్లస్ అలకరాజ్ వరల్డ్ నెంబర్ 3 గా ఉన్న డేనియల్ తో హోరాహోరీగా పోరాడాడు. మ్యాచ్ కు ముందు వరకు ఫేవరెట్ గా ఉన్న కార్లస్ గ్రౌండ్ లోకి దిగగానే ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. డేనియల్ కళ్ళు చెదిరే షాట్ లకు కార్లస్ దగ్గర నుండి సమాధానమే లేకుండా పోయింది. మొదటి సెట్ ను టై బ్రేక్ లో గెలుచుకున్న డేనియల్ రెండవ సెట్ ను అలవోకగా సొంతం చేసుకున్నాడు. కానీ మూడవ సెట్ ను కార్లస్ గెలుచుకోగా, పుంజున్న డేనియల్ నాలుగవ సెట్ ను మరియు మ్యాచ్ ను గెలుచుకుని సెమీఫైనల్ లో కార్లస్ ను ఓడించి గట్టి షాక్ ఇచ్చాడు.

దీనితో మూడవ సరి యూఎస్ ఫైనల్ లోకి చేరుకున్నాడు డేనియల్… సెట్ స్కోర్స్ ఇలా … డేనియల్ 7-6 ,, 6 – 1 మరియు 6 – 4 తేడాతో మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు. కార్లస్ కు పుంజుకునే అవకాశాలు వచ్చినా వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఫైనల్ లో జొకోవిచ్ తో ట్రోఫీ కోసం తలపడనున్నాడు.